గురువుకు గుడి కట్టిన శిష్యులు వీడియో వైరల్

Updated on: Sep 12, 2025 | 3:41 PM

తల్లి, తండ్రి, గురువు ప్రత్యక్ష దైవాలు అనే మాటలను నిజం చేసి తమకు పాఠాలు బోధించిన గురువు విగ్రహాన్ని శిష్యులు ఏర్పాటు చేశారు. గురువును దైవంగా భావించిన ఆ విద్యార్థులు బాల్యంలో తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఆ ఉపాధ్యాయునికి ఒక గుడి కట్టి అందులో ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించి గురువు పట్ల ఉన్న భక్తిని చాటుకున్నారు. నేను గంగారావు దగ్గర ఆ రోజుల్లో చూశాను ఆ వేళ స్కూల్ ఫస్ట్ లో పాస్ అయ్యాక,నేను ఆర్టీసిలో ఒక టీఏ గా ఉద్యోగం చేస్తున్నాను. ఆయన చెప్పిన చదువు వల్లే, ఉచితంగా ఏమి డబ్బులు తీసుకోకుండా చదువు చెప్పారు దాని వల్లనే ఈ రోజున నేను ఆర్టీసిలో జాబ్ చేయగలుగుతున్నాను. రెండోది నాలాగే ఏం లేనటువంటి పేద విద్యార్ధులకి చాలా మందికి ఆయన ఉచితంగా విద్య బోధించి, స్కూల్ పిల్లలకి పుస్తకాలు కొనివ్వడం, ఫీజులు కట్టడం అన్నీ చేసేవారు. ప్రతి విద్యార్థినీ కూడా ఒక సొంత బిడ్డలాగా చూసుకుని చక్కగా అందరినీ చదువుకునేలాగా విద్యావంతులు చేశారండి ఆయన.

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం చింతలపల్లికి చెందిన టీచర్ గుబ్బల రంగారావు తన కెరీర్ లో బెస్ట్ టీచర్ గా గుర్తింపు పొందారు. దశాబ్దాల పాటు బోధన చేసిన ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుతో పాటు ఎన్నో అవార్డులు అందుకున్నారు. రెడ్ క్రాస్ అవార్డు గ్రహీత కూడా ఆయన రంగారావు మాస్టారు అంటే ఆ ప్రాంతంలో అందరికీ ఎంతో గౌరవం. మాస్టారి మరణం తర్వాత ఆయన గుర్తుగా ఏదైనా చెయ్యాలని ఆయన శిష్యులంతా ఆలోచించి గుడి కట్టాలన్న నిర్ణయానికి వచ్చారు. వెంటనే తమ ఆలోచనను ఆచరణలో పెట్టారు. రంగారావు మాస్టారి ఇంటి ప్రాంగణంలోనే మందిరం నిర్మించి విగ్రహం కూడా రెడీ చేశారు. ఈ విగ్రహాన్ని మాజీ డిప్యూటీ స్పీకర్ అల్లురి వెంకట సూర్యనారాయణరాజు చేతుల మీదగా ఆవిష్కరించేశారు. నేను కూడా ఆయన శిష్యుల బృందంలో ఒకడినే. చాలామంది విద్యార్థులు సుమారు నిన్న ఆయన గుడి ఆవిష్కరణకి సుమారు ఐదు వందల మంది విద్యార్థులు ఇక్కడ రావడం జరిగింది. దాంతో పాటు గ్రామస్తులు సుమారు ఆయన బంధువులు ఉండి, గ్రామస్తులు ఉండి సుమారు వాళ్ళు ఐదు వందల మంది, సుమారు వెయ్యి మందితో మహోన్నతంగా ఈ గుడి కార్యక్రమం అనేటువంటిది నిన్న ఆవిష్కరణ అనేటువంటిది జరిగింది. ఆయన దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థులు అంటే కేవలం హైస్కూల్లో ఆయన శిష్యులే కాకుండా చాలా మంది ఉన్నారు.

మరిన్ని వీడియోల కోసం :

తురకపాలెం బాధితుల్లో మెలియాయిడోసిస్‌ లక్షణాలు గుర్తింపు వీడియో

నర్సరీలో వింత శబ్దాలు.. దగ్గరకు వెళ్లి చూసిన కూలీలకు షాక్ వీడియో

బస్సులో ఫోన్‌ పోగొట్టుకున్నారా.. జాగ్రత్త వీడియో

అలవాటుగా ఇంటి సీలింగ్‌వైపు చూసి వణికిపోయిన వ్యక్తి.. ఏం జరిగిందంటే?వీడియో