Srisailam: భ్రమరాంబిక అమ్మవారికి బంగారు హారం

Updated on: Jan 30, 2026 | 4:55 PM

దేశంలోనే ప్రముఖ జ్యోతిర్లింగం, మరియు శక్తిపీఠంగా విరాజిల్లుతున్న శ్రీశైలం ఆలయానికి రెండు తెలుగు రాష్టాలనుంచే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాలనుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. స్వామి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. ఈ క్రమంలో ఓ భక్తుడు శ్రీశైల భ్రమరాంబిక అమ్మవారికి బంగారు హారం కానుకగా సమర్పించి తన భక్తిని చాటుకున్నారు.

దేశంలోనే ప్రముఖ జ్యోతిర్లింగం, మరియు శక్తిపీఠంగా విరాజిల్లుతున్న శ్రీశైలం ఆలయానికి రెండు తెలుగు రాష్టాలనుంచే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాలనుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. స్వామి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. ఈ క్రమంలో ఓ భక్తుడు శ్రీశైల భ్రమరాంబిక అమ్మవారికి బంగారు హారం కానుకగా సమర్పించి తన భక్తిని చాటుకున్నారు. ఈ క్రమంలో నంద్యాల జిల్లాకు చెందిన పార్థసారథి గౌడ్ కుటుంబ సమేతంగా శ్రీశైల శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకున్నారు. అనంతరం అమ్మవారికి 10 గ్రాముల బంగారు హారాన్ని కానుకగా సమర్పించారు. ఈ బంగారు హారాన్ని ఆలయ దేవస్థానం చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడుకు పార్థసారథి గౌడ్ కుటుంబ సభ్యులు అధికారికంగా అందజేశారు. అనంతరం అర్చకులు పార్థసారథి గౌడ్ దంపతులకు వేద ఆశీర్వచనాలు పలికారు. దేవస్థానం చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు, ఆలయ అధికారులు, అర్చకులు స్వామి అమ్మవార్ల శేష వస్త్రాలు, జ్ఞాపికలను అందజేసి ఘనంగా సత్కరించారు. భ్రమరాంబ దేవి అమ్మవారికి భక్తులు ఈ విధంగా బంగారు ఆభరణాలు సమర్పించడం ఆనవాయితీగా కొనసాగుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఓర్నీ.. మటన్‌ బొక్క ఎంతపని చేసిందీ

రూ.99/- కే టికెట్…! హిట్టు కొట్టేందుకు మనోడి నయా స్ట్రాటజీ

TOP 5 ET: ఇక NTR విషయంలో జాగ్రత్త !! తారక్‌కు కోర్టు రక్షణ !!

Upasana: మెగా ట్విన్ బేబీస్‌ ఆహ్వానానికి ప్రత్యేక ఏర్పాట్లు

అర్ధరాత్రి నటితో అనుచిత ప్రవర్తన.. అసలేం జరిగింది ??