బీఆర్ఎస్ ఓటమికి కారణం అదే.. శ్రీనివాస్ గౌడ్ కీలక వ్యాఖ్యలు

|

Dec 08, 2024 | 2:25 PM

కాంగ్రెస్‌ హామీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు మాజీమంత్రి శ్రీనివాస్‌గౌడ్‌. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్తే నిజాలు తెలుస్తాయన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో ప్రజలకు స్వేచ్ఛలేదంటూ తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు.

కాంగ్రెస్ హామీలను నమ్మే ప్రజలు ఓట్లేశారని, మాజీమంత్రి శ్రీనివాస్‌గౌడ్‌. కాంగ్రెస్ MLAలు జనంలోకి వెళ్తే నిజాలు తెలుస్తాయన్నారు. ఏదో ఆశించి బీఆర్‌ఎస్‌ను ప్రజలు వదులుకున్నారని చెప్పారు. ఫిరాయింపులపై కాంగ్రెస్‌ది ద్వంద్వ వైఖరి అని విమర్శించారు శ్రీనివాస్‌గౌడ్‌. కాంగ్రెస్‌ హామీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు మాజీమంత్రి శ్రీనివాస్‌గౌడ్‌. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్తే నిజాలు తెలుస్తాయన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో ప్రజలకు స్వేచ్ఛలేదంటూ తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు. రాహుల్ గాంధీ తెలంగాణలో చెప్పిందేంటి అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం అని ఉండాలనే TS అని పెట్టామన్నారు. గత పదేళ్లలో 50 లక్షల కోట్ల ఆస్తులు సృష్టించామని టీవీ9 కాంక్లేవ్‌లో చెప్పారు శ్రీనివాస్‌గౌడ్‌. ఉద్యోగులకు ఇస్తామన్న డీఏ ఎక్కడ అని ప్రశ్నించారు.

మరోవైపు Tv9 కాంక్లేవ్‌కు ఇవాళ రాత్రి 8 గంటలకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హాజరవుతారు. కేసీఆర్‌ వారసుడు కేటీఆరేనా? కాంగ్రెస్‌ ఏడాదిపాలనపై ఛార్జ్‌షీట్‌ ఓకే.. పార్టీ బలోపేతం సంగతేంటి? హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ వంటి పలు అంశాలపై అభిప్రాయాలను పంచుకుంటారు కేటీఆర్‌.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Published on: Dec 08, 2024 02:25 PM