స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో

Updated on: Dec 07, 2025 | 11:32 AM

పలాష్‌ ముచ్చల్ తో వివాహం వాయిదా పడిన తర్వాత, స్టార్ క్రికెటర్‌ స్మృతి మంధాన పెట్టిన ఇన్‌స్టా పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. పెళ్లి వాయిదా పడ్డాక స్మృతి తొలిసారిగా ఓ టూత్‌పేస్ట్ బ్రాండ్‌కు సంబంధించిన యాడ్ పోస్ట్ చేసింది. అయితే, అందులో ఆమె చేతికి ఎంగేజ్‌మెంట్ ఉంగరం లేకపోవడాన్ని గమనించిన అభిమానులు రకరకాలుగా చర్చించుకుంటున్నారు.

నవంబర్ 23న జరగాల్సిన వీరి వివాహం చివరి నిమిషంలో వాయిదా పడింది. పెళ్లి రోజున స్మృతి తండ్రి శ్రీనివాస్ అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరగా, మరుసటి రోజు పలాష్‌ కూడా అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యాడు. దీంతో పెళ్లిని వాయిదా వేస్తున్నట్లు ఇరు కుటుంబాలు ప్రకటించాయి. ప్రస్తుతం ఇద్దరూ కోలుకున్నారు. అయితే, స్మృతి తన సోషల్ మీడియా ఖాతాల నుంచి హల్దీ ఫంక్షన్‌ ఫొటోలను డిలీట్‌ చేయడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది.ఈ ప్రచారంపై పలాశ్ కుటుంబ సభ్యులు స్పందించారు. కేవలం ఆరోగ్య సమస్యల వల్లే పెళ్లి వాయిదా పడిందని, త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తామని చెప్పారు. పలాష్‌ తల్లి అమితా ముచ్చల్ మాట్లాడుతూ, “స్మృతి, పలాశ్ ఇద్దరూ చాలా బాధలో ఉన్నారనీ త్వరలో అంతా సర్దుకుని త‌ప్ప‌కుండా పెళ్లి జరుగుతుందని అన్నారు.