చిన్నారి ఫ్యాన్ కు స్మృతి మంధాన రిప్లై టీ20ల్లో రికార్డు
తాజాగా టీ20ల్లో 4000 పరుగులు పూర్తి చేసి చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన, ఈ ఘనత సాధించిన తొలి భారతీయ బ్యాటర్‌గా నిలిచింది. తన ప్రతిభతో యువతకు, ముఖ్యంగా మహిళా క్రికెటర్లకు స్ఫూర్తినిస్తోంది. కాశ్మీర్‌కు చెందిన ఓ చిన్నారి స్మృతి మంధానను ఆదర్శంగా తీసుకుని క్రికెటర్‌గా మారాలని కలలు కంటోంది. మంధాన రికార్డు, ఆమె స్ఫూర్తినిచ్చే ప్రయాణం దేశంలోని మారుమూల ప్రాంతాల్లోనూ క్రీడలపై ఆసక్తిని పెంచుతున్నాయి.
తాజాగా టీ20ల్లో 4 వేల పరుగులు పూర్తి చేసుకున్న స్మృతి మంధాన ఈ ఘనత సాధించిన తొలి భారతీయ బ్యాటర్‌గా చరిత్ర సృష్టించింది. మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో రెండో బ్యాటర్‌గా నిలిచింది. ఇలా తన ప్రతిభతో తదుపరి తరాన్ని ఆకర్షిస్తోంది స్మృతి. ఈ స్టార్ బ్యాటర్‌ను ప్రేరణగా తీసుకుని క్రికెట్లో అడుగుపెట్టాలని కలలు కంటున్నారు చాలా మంది అమ్మాయిలు. అందులో కాశ్మీర్‌కు చెందిన ఈ చిన్నారి బాలిక ఒకరు. నేనూ స్మృతి మంధాన అవుతానని అంటోంది. తన పట్ల స్మృతి మంధాన చూపిన ప్రేమకు.. ఇలా స్పందించింది ఆ బాలిక. దర్శకుడు కబీర్ ఖాన్ ఇటీవల జమ్మూకాశ్మీర్‌లో పర్యటించారు. అక్కడ ఆయన అరు వ్యాలీలో పర్యటిస్తుండగా.. క్రికెట్ ఆడుతూ ఒక చిన్నారి కనిపించింది. ఆ చిన్నారి తనకు స్మృతి మంధాన అంటే చాలా ఇష్టమని.. తాను ఆమెకు పెద్ద అభిమానినని కబీర్ ఖాన్‌తో చెప్పింది. ఈ విషయాన్ని స్మృతి మంధానకు చేరవేయాలని ఆ చిన్నారి కోరింది. దీంతో కబీర్ ఖాన్ ఆ చిన్నారి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ పోస్టుకు “కాశ్మీర్ లో ఈ చిన్నారి తన అభిమాన ప్లేయర్ స్మృతి మంధాని అని చెప్పింది. ఈ పోస్ట్ స్మృతికి చేరుతుందని ఆశిస్తున్నాను” అని రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌కు స్మృతి మంధాన స్పందించింది. కాశ్మీర్ అరు వ్యాలీలోని ఆ చిన్నారి ఛాంపియన్‌కు తన తరఫున ఒక పెద్ద హగ్ ఇవ్వండి.. తను కూడా ఆమె కోసం ఎదురుచూస్తున్నానని చెప్పండి అంటూ చెప్పింది. స్మృతి పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆరు వ్యాలీలో స్థానిక ప్రభుత్వం పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న చిన్నారి ఆమియా.. స్మృతి మంధాన తనకు హగ్‌లు పంపడం పట్ల సంతోషం వ్యక్తం చేసింది. భవిష్యత్తులో తాను కూడా స్మృతి మంధాన లాగా మంచి క్రికెటర్ కావాలనుకుంటున్నట్లు తెలిపింది. అయితే తన గ్రామంలో క్రికెట్ ఆడటానికి మంచి గ్రౌండ్ లేదని.. సరైన విద్య వసతులు లేవని తెలిపింది. అంతేకాకుండా తాను స్మృతి మంధానను హగ్ చేసుకోవాలనుకుంటున్నట్లు తెలిపిన చిన్నారి ఆమియా.. తమ గ్రామానికి స్మృతి మంధానను ఆహ్వానించింది. దేశంలోని మారుమూల ప్రాంతాల్లో కూడా క్రీడా దిగ్గజాల నుంచి లభించే స్ఫూర్తి..చిన్నారుల జీవితాలపై ఎలా ప్రభావం చూపిస్తుంది అనే దానికి ఈ ఘటన నిదర్శనం. అంతర్జాతీయ టీ20ల్లో భారత మహిళ క్రికెటర్ స్మృతి మంధాన అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. టీ20లలో 4000 పరుగులు దాటిన రెండవ మహిళా క్రికెటర్‌గా ఆమె నిలిచింది. నిన్న శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో ఆమె ఈ ఘనతను సాధించింది. విశాఖపట్నం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 25 పరుగులు చేసిన స్మృతి ఈ రికార్డును నమోదు చేసింది. స్మృతి 154 మ్యాచుల్లో 4007 రన్స్ చేసింది. ఇందులో ఒక సెంచరీతో పాటు 31 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఓవరాల్‌గా ఈ జాబితాలో కివీస్ ప్లేయర్ సుజీ బేట్స్ 4,716 పరుగులతో తొలి స్థానంలో ఉంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వాట్సప్ యూజర్స్… బీ అలర్ట్… ఘోస్ట్ పెయిరింగ్‌కు చెక్ పెట్టండిలా
Dhurandhar: ధురంధర్ కలెక్షన్స్‌లో షేర్ కావాలి! పాకిస్తానీల వింత డిమాండ్
చడీచప్పుడు కాకుండా కూతురి పెళ్లి చేసిన జగపతి బాబు
Champion: రిలీజ్‌కు ముందే ఛాంపియన్ రికార్డ్.. భారీ ధరకు ఓటీటీ డీల్
