ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రోహిత్, కోహ్లీ రీఎంట్రీ? వీడియో

Updated on: Nov 23, 2025 | 3:59 PM

సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్ తర్వాత టీమిండియా మూడు వన్డేల సిరీస్‌కు సిద్ధమవుతోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వన్డే జట్టులోకి తిరిగి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. గాయాల కారణంగా హార్దిక్ పాండ్యా, శ్రేయస్ అయ్యర్ దూరమయ్యే సూచనలున్నాయి. శుభ్‌మన్ గిల్ లభ్యతపై సందేహాలు నెలకొనగా, జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినిస్తున్నారు. త్వరలో బీసీసీఐ భారత జట్టును ప్రకటించనుంది.

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అభిమానులకు శుభవార్త. సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్ ముగిసిన వెంటనే టీమిండియా మూడు వన్డేల సిరీస్‌కు సిద్ధమవుతోంది. నవంబర్ 26న గౌహతిలో రెండో టెస్టు పూర్తవ్వగా, కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే, అంటే నవంబర్ 30న రాంచీ వేదికగా తొలి వన్డే జరగనుంది. ఈ సిరీస్ కోసం బీసీసీఐ త్వరలోనే భారత జట్టును ప్రకటించనుంది.ఈ వన్డే సిరీస్‌లో టీమిండియా స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తిరిగి వన్డే జట్టులోకి అడుగు పెట్టనున్నట్లు సమాచారం.

మరిన్ని వీడియోల కోసం :

బ్యాక్ బలంగా ఉండడం అవసరం..సమంత పోస్ట్ వైరల్ వీడియో

ప్లాన్ మార్చిన ఓటీటీ… నిర్మాతలకు నష్టాలు తప్పవా? వీడియో

బిగ్‌బాస్ నిర్వాహకులకు దెబ్బ మీద దెబ్బ వీడియో