టీమిండియా అండర్-19 జట్టులో హైదరాబాదీకి ఛాన్స్‌

Updated on: Nov 15, 2025 | 12:02 PM

హైదరాబాద్ యువ క్రికెటర్ మహ్మద్ అబ్దుల్ మాలిక్ టీమిండియా అండర్-19 జట్టుకు ఎంపికయ్యాడు. ఫాస్ట్ బౌలర్‌గా రాణిస్తున్న మాలిక్, వినూ మన్కడ్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసి అందరినీ ఆకట్టుకున్నాడు. మహమ్మద్ సిరాజ్ స్ఫూర్తితో కష్టపడిన మాలిక్, ఇండియన్ టీమ్‌కు ఆడాలని కలలు కంటున్నాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే సిరీస్‌లో పాల్గొననున్నాడు.

టీమిండియా అండర్-19 జట్టుకు హైదరాబాద్ కుర్రాడు ఎంపికయ్యాడు. నాంపల్లిలోని మల్లెపల్లికి చెందిన ఈ యువ క్రికెటర్ మహ్మద్ అబ్దుల్ మాలిక్ ప్రస్తుతం ఫాస్ట్ బౌలర్‌గా రాణిస్తున్నాడు. ఇటీవలే జరిగిన వినూ మన్కడ్ ట్రోఫీలో తన ప్రతిభతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ టోర్నీలో మాలిక్ అత్యధిక వికెట్లు తీసి టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. మాలిక్‌ తండ్రి మహ్మద్ అబ్దుల్ సుబాన్ కేక్ కట్ చేసి , టపాసులు పేల్చి సంబరాలు నిర్వహించారు. ఇండియన్ పాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ ప్రేరణతో ప్రాక్టీస్ చేసి , అండర్ 19 టీమ్ కు సెలెక్ట్ అయినట్లు మహమ్మద్ మాలిక్ తెలిపారు. ఈ నెల 17న బెంగళూరు వేదికగా ఆఫ్ఘనిస్తాన్ తో జరగనున్న సిరీస్ లో పాల్గొననున్నట్లు మాలిక్ చెప్పారు. భవిష్యత్తులో ఇండియన్ టీమ్ కు ప్రాతినిధ్యం వహించడం తన డ్రీమ్ అని…ఆ దిశగా మెరుగైన ప్రదర్శన ఇస్తానని మాలిక్ స్పష్టం చేశారు. పాఠశాల స్థాయి నుంచే క్రికెట్‌లో సత్తా చాటుతున్న మాలిక్‌కు 2022లో హైదరాబాద్ అండర్-16 జట్టులో చోటు దక్కింది. విజయ్ మర్చంట్ ట్రోఫీలో రాణించిన మాలిక్.. ఓ ట్రిపుల్ సెంచరీ సహా 511 పరుగులు సాధించాడు. ఈ ప్రదర్శనతో అతడికి మంచి గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం మాలిక్ హైదరాబాద్‌లోని ఓ డిగ్రీ కాలేజీలో బీకామ్ చదువుతున్నాడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రూటు మార్చిన చైన్ స్నాచర్లు.. డైరెక్ట్ గా ఇంట్లోకి చొరబడుతోన్న గొలుసు దొంగలు

అయ్యో.. ఆమె ఏం పాపం చేసిందిరా.. అలా చంపేశారు

జూపార్క్‌లో దారుణం.. దుప్పులను చంపేసిన కుక్కలు

కళ్యాణకట్టలో ఉద్యోగాలంటూ బురిడీ కొట్టించిన లేడీ కిలాడీ

లక్కీ డ్రాలో రూ.250 కే సొంతిల్లు! పోలీసుల రంగ ప్రవేశంతో