Hyderabad: అజహరుద్దీన్‌కు భారీ షాక్.. HCA ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు.. కారణమిదే
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్.. ఇక్కడ పదవిలో ఎవరున్నా.. కొట్లాట మాత్రం కామన్. శివలాల్ యాదవ్, అర్షద్ ఆయుబ్, వినోద్, అజారుద్దీన్.. ఇలా అధ్యక్షులు మారినా HCA తీరు మారలేదు. చివరకు సుప్రీంకోర్టే కలుగజేసుకుని.. ఎన్నికల నిర్వహణ కోసం ప్రత్యేక కమిటీని నియమించింది. ఇది జరిగి ఆరునెలలు గడిచాక.. ఇప్పుడు ఎన్నికలకు ముహూర్తం కుదిరింది. ఈనెల 20న హెచ్‌సీఏ ఎన్నికలు. ఇక్కడే ఇంకో మెలిక.
వివాదాల పుట్ట హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్.. ఎట్టకేలకు ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఇదే సమయంలో HCA చుట్టూ మరో ఆసక్తికరమైన వివాదం కూడా మొదలైంది. కారణం.. అజాహరుద్దీన్ ఓటుహక్కు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్.. ఇక్కడ పదవిలో ఎవరున్నా.. కొట్లాట మాత్రం కామన్. శివలాల్ యాదవ్, అర్షద్ ఆయుబ్, వినోద్, అజారుద్దీన్.. ఇలా అధ్యక్షులు మారినా HCA తీరు మారలేదు. చివరకు సుప్రీంకోర్టే కలుగజేసుకుని.. ఎన్నికల నిర్వహణ కోసం ప్రత్యేక కమిటీని నియమించింది. ఇది జరిగి ఆరునెలలు గడిచాక.. ఇప్పుడు ఎన్నికలకు ముహూర్తం కుదిరింది. ఈనెల 20న హెచ్‌సీఏ ఎన్నికలు. ఇక్కడే ఇంకో మెలిక. ఇటీవల హెచ్‌సీఏలోని 57 క్లబ్స్‌కి చెక్ పెట్టింది జస్టిస్ లావు నాగేశ్వరరావు కమిటీ. ఈ క్లబ్బుల్లో సభ్యులుగా ఉన్నవారు హెచ్‌సీఏ ఎన్నికల్లో పోటీ చేయకూడదని ఆదేశాలు కూడా ఇచ్చింది. ఇలా నిషేధానికి గురైన వారిలో హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్ సహా మరికొందరు ప్రముఖులున్నారు. అనర్హత వేటు పడ్డ కీలక వ్యక్తులు ఇప్పటికే మంతనాలు షురూ చేశారు. తమ అనుచరుల్ని బరిలోకి దించి.. పరోక్ష పెత్తనానికి సిద్ధమయ్యారు. HCA మాజీ ప్రెసిడెంట్ అజారుద్దీన్, వంకా ప్రతాప్ ఒక వర్గంగా, మరో మాజీ ప్రెసిడెంట్ వినోద్, వివేక్ మరికొంత మందితో కలిసి ఒక వర్గంలా.. మారి.. సిండికేట్ పాలిటిక్స్ షురూ చేశారు. సో.. బిగ్ పర్సనాలిటీలు బరిలో లేకపోయినా ఈసారి HCA ఎన్నికలు అత్యంత ఆసక్తికరంగా మారబోతున్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మాల్‌లో ఫ్రిడ్జ్ డోర్ తెరిచి.. ప్రాణం కోల్పోయిన చిన్నారి
సచివాలయంలో గంజాయి మొక్క కలకలం !!
బాబోయ్ ఎంతపెద్ద తిమింగలమో !! కేరళ తీరంలో టెన్షన్
అన్నదానంలో 32 వంటకాలు.. తిన్న వారికి తిన్నంత
Black Magic: నగ్నంగా గోదావరి ఒడ్డుపై తాంత్రిక పూజలు చేస్తుండగా ??