మెస్సీతో ఫోటో.. రూ.10 లక్షలు మాత్రమే

Updated on: Dec 13, 2025 | 7:47 AM

మెస్సీ 'GOAT ఇండియా టూర్ 2025'లో భాగంగా డిసెంబర్ 13న హైదరాబాద్‌కు రానున్నాడు. ఫలక్‌నుమా ప్యాలెస్‌లో రూ.10 లక్షలతో మీట్ అండ్ గ్రీట్, ఉప్పల్ స్టేడియంలో ఫుట్‌బాల్ మ్యాచ్, పిల్లల కోసం క్లినిక్, పెనాల్టీ షూటౌట్ వంటి కార్యక్రమాలున్నాయి. రోడ్రిగో డి పాల్, లూయిస్ సువారెజ్ కూడా పాల్గొంటారు. టికెట్లు 'డిస్ట్రిక్ట్' యాప్‌లో అందుబాటులో ఉన్నాయి.

ఫుట్‌బాల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘గోట్ ఇండియా టూర్ 2025’కు సమయం ఆసన్నమైంది. అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ మూడు రోజుల పర్యటన కోసం భారత్‌కు వస్తున్నారు. డిసెంబర్‌ 13, 14, 15 తేదీల్లో ఆయన కోల్‌కతా, హైదరాబాద్, ముంబై, న్యూఢిల్లీ నగరాల్లో పర్యటించనున్నారు. మెస్సీ డిసెంబర్ 13న హైదరాబాద్ వస్తారు. ఈ క్రమంలో అభిమానులు మెస్సీతో ప్రత్యేకంగా ఫోటోలు తీసుకోవచ్చు. ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరిగే ‘మెస్సితో మీట్‌ అండ్‌ గ్రీట్‌’ కార్యక్రమంలో ఆయనతో ఫొటోలు దిగొచ్చు. ఫోటో దిగాలనుకునే అభిమానులు రూ.10 లక్షలు చెల్లించి ఫోటోలు దిగవచ్చని, వందమంది వరకూ ఫోటోలు దిగే అవకాశం ఉంటుందని హైదరాబాద్‌లోని ‘ద గోట్‌ టూర్‌’ నిర్వాహక కమిటీ సలహాదారు పార్వతిరెడ్డి బుధవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. సంబంధిత టికెట్లు డిస్ట్రిక్ట్‌ యాప్‌లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మెస్సీ..శనివారం సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్‌ చేరుకుంటారు. రాత్రి 7 గంటలకు ఉప్పల్‌ స్టేడియానికి వస్తారు. మెస్సితో పాటు రోడ్రిగో డి పాల్‌, లూయిస్‌ సువారెజ్‌ కూడా స్టేడియంకు వస్తారు. ఇందులో భాగంగా సింగరేణి ఆర్‌ఆర్‌-9తో, అపర్ణ మెస్సి ఆల్‌ స్టార్స్‌ జట్టు 20 నిమిషాల పాటు ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ ఆడుతుంది. ఆ తర్వాత ఫుట్‌బాల్ క్లినిక్ ఉంటుంది. దీనిలో భాగంగా మెస్సీ.. చిన్నారులకు ఫుట్‌బాల్‌ ఎలా ఆడాలి.. ఎలా ట్రైనింగ్ తీసుకోవాలి.. ఏమేం నేర్చుకోవాలి అనే చిట్కాలు చెబుతారు. అలానే మెస్సీ సమక్షంలో పెనాల్టీ షూటౌట్‌ కూడా నిర్వహిస్తారు. గెలిచిన వారికి మెస్సి బహుమతులు ఇస్తారు. అనంతరం నిర్వహించే పరేడ్‌లో సీఎం రేవంత్‌రెడ్డి.. మెస్సీని సన్మానిస్తారు. ఈ క్రమంలో సుమారు గంట పాటు మెస్సీ ఉప్పల్‌ స్టేడియంలో ఉంటారు. శనివారం రాత్రి మెస్సీ హైదరాబాద్‌లోనే బస చేసి.. ఆదివారం ఉదయం ముంబైకి వెళ్తారని పార్వతిరెడ్డి తెలిపారు. మెస్సీ హైదరాబాద్ టూర్‌కి సంబంధించి.. డిస్ట్రిక్ట్ యాప్‌లో అన్ని రకాల టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

శేష వస్త్రాల కొనుగోలులో.. సశేష ప్రశ్నలెన్నో స్కామ్.. ఎలా బయటపడిందంటే..?