T20 World Cup: పాక్‌కు సూపర్‌ షాకిచ్చిన ముంబయి ఇంజినీర్‌.. ఎవరీ సౌరభ్‌ నేత్రావల్కర్‌.?

|

Jun 09, 2024 | 5:37 PM

టీ20 ప్రపంచకప్‌ టోర్నీ లో అమెరికా అద్భుత విజయం వెనుక ఓ భారత హీరో ఉన్నాడు. పద్నాలుగేళ్ల కిందటే తన బౌలింగ్‌తో పాకిస్థాన్‌ కు చుక్కలు చూపించిన అతడు.. ఇప్పుడు మళ్లీ బాబర్‌ జట్టును కంగుతినిపించాడు. తీవ్రమైన ఒత్తిడిలోనూ కూల్‌గా బౌలింగ్‌ చేసి అమెరికాకు ‘సూపర్‌’ విక్టరీ అందించాడు. అతడే సౌరభ్‌ నేత్రావల్కర్‌. వృత్తిరీత్యా ఇతనొక ఇంజినీర్‌. క్రికెట్‌మీద మక్కువతో బంతి అందుకుని సంచలనం సృష్టించాడు.

టీ20 ప్రపంచకప్‌ టోర్నీ లో అమెరికా అద్భుత విజయం వెనుక ఓ భారత హీరో ఉన్నాడు. పద్నాలుగేళ్ల కిందటే తన బౌలింగ్‌తో పాకిస్థాన్‌ కు చుక్కలు చూపించిన అతడు.. ఇప్పుడు మళ్లీ బాబర్‌ జట్టును కంగుతినిపించాడు. తీవ్రమైన ఒత్తిడిలోనూ కూల్‌గా బౌలింగ్‌ చేసి అమెరికాకు ‘సూపర్‌’ విక్టరీ అందించాడు. అతడే సౌరభ్‌ నేత్రావల్కర్‌. వృత్తిరీత్యా ఇతనొక ఇంజినీర్‌. క్రికెట్‌మీద మక్కువతో బంతి అందుకుని సంచలనం సృష్టించాడు. దీంతో సౌరభ్‌ పేరు ఇప్పుడు సోషల్‌ మీడియాలో మార్మోగుతోంది. సౌరభ్ 1991 అక్టోబరు 16న ముంబయిలో జన్మించాడు. చిన్నప్పటి నుంచే క్రికెట్‌ అంటే ఇష్టం. భారత్‌ తరఫున అండర్‌ -19 జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. కేఎల్‌ రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌, హర్షల్‌ పటేల్‌, జయ్‌దేవ్‌ ఉనద్కత్‌, సందీప్‌ శర్మ వంటి ఆటగాళ్లతో కలిసి ఆడాడు. భారత్‌లో తీవ్రమైన పోటీ కారణంగా ఆ తర్వాత టీమ్‌ఇండియాలో చోటు దక్కించుకోలేకపోయాడు.

23 ఏళ్ల వయసులో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. ఆ మరుసటి ఏడాది కార్నెల్‌ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్‌ సైన్స్‌లో మాస్టర్స్‌ పూర్తి చేసి సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో చేరాడు. అయినా ఆటపై ఇష్టాన్ని వదులుకోలేకపోయాడు. అమెరికా జాతీయ జట్టులో చోటు దక్కించుకుని ఎట్టకేలకు 2019లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌పై తొలి మ్యాచ్‌ ఆడాడు. అమెరికా జట్టుకు కొంతకాలం కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. ఇప్పటి వరకు 48 వన్డేలు, 29 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. గురువారం నాడు పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో నేత్రావల్కర్‌ పాక్‌ను అద్భుతంగా కట్టడి చేశాడు. అమెరికా జట్టు తరఫున ప్రపంచకప్‌ టోర్నీకి ఎంపికైన తర్వాత నేత్రావల్కర్‌.. ఇది చాలా భావోద్వేగ క్షణం. ఉన్నత చదువుల కోసం బ్యాగ్ సర్దుకుని అమెరికా వచ్చేశాను. మళ్లీ క్రికెట్‌ ఆడుతానని కలలో కూడా ఊహించలేదు. నా క్రికెట్‌ షూ కూడా తెచ్చుకోలేదంటూ భావోద్వేగానికి లోనయ్యారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.