Hardik Pandya Dance Video: శ్రీవల్లి పాటకు నాన్నమ్మతో కలిసి హార్దిక్ డ్యాన్స్.! క్యూటెస్ట్ వీడియో అంటూ నెటిజన్లు కామెంట్స్..
శ్రీవల్లి సిగ్నేచర్ స్టెప్పును తన నాన్నమ్మతో కలిసి వేశాడీ స్టార్ క్రికెటర్. చివర్లో ఇద్దరూ కలిసి తగ్గేదేలే అంటూ బన్నీ స్టైల్ ను అనుకరించారు. అనంతరం మా పుష్ప నానమ్మ అంటూ ఆ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు హార్దిక్ పాండ్యా.
శ్రీవల్లి సిగ్నేచర్ స్టెప్పును తన నాన్నమ్మతో కలిసి వేశాడీ స్టార్ క్రికెటర్. చివర్లో ఇద్దరూ కలిసి తగ్గేదేలే అంటూ బన్నీ స్టైల్ ను అనుకరించారు. అనంతరం మా పుష్ప నానమ్మ అంటూ ఆ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు హార్దిక్ పాండ్యా. దీంతో వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముఖ్యంగా వయసు సహకరించకపోయినా కళ్లకు గ్లాసెస్ పెట్టుకుని మనవడితో కలిసి స్టెప్పులేసిన బామ్మపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. క్యూటెస్ట్ వీడియో, ది వేరే లెవెల్ అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్స్.