వన్డే కెప్టెన్‌గా గిల్‌ !! రోహిత్‌కు మరో షాక్‌ తప్పదా ??

Updated on: Oct 08, 2025 | 5:37 PM

భారత వన్డే జట్టుకు కెప్టెన్‌ మారిపోయాడు. రోహిత్‌ శర్మ స్థానంలో శుభ్‌మన్‌ గిల్ న్యూ సారథి అయిపోయాడు. ఆస్ట్రేలియాతో త్వరలో ప్రారంభం కానున్న సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. శుభ్‌మన్‌ గిల్‌ను కెప్టెన్‌ చేసిన బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ ఇప్పటివరకూ కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మ ఆటగాడిగా మాత్రమే కొనసాగుతాడని తేల్చింది. ఈ నేపథ్యంలో క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ మరిన్ని షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు.

రోహిత్‌ స్థానంలో గిల్‌కు అవకాశం ఇవ్వడం మంచి నిర్ణయమన్నాడు. రాబోయే రోజుల్లో మరిన్ని చేదు వార్తలు వినాల్సి వస్తుందని కూడా క్లూ ఇచ్చాడు గావస్కర్. దీంతో ‘త్వరలో రోహిత్ రిటైర్‌మెంట్’ అనే అనే చర్చ జోరందుకుంది. ‘‘వన్డే వరల్డ్ కప్ – 2027 కోసం రోహిత్ శర్మ సిద్ధంగా ఉంటాడని అనుకోవడం లేదు. ఇంటర్నేషనల్ క్యాలెండర్‌లో మన జట్టుకు రాబోయే రెండేళ్లలో ఎక్కువ వన్డేలు లేవు. ఇక.. ఏడాదికి ఆరేడు మాత్రమే ఆడితే వారికి సరైన మ్యాచ్‌ ప్రాక్టీస్ దొరకదు. వరల్డ్ కప్‌ కోసం ఆ సన్నద్ధత సరిపోదు. అందుకే గిల్‌ను సిద్ధం చేసేందుకు బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చు’’ అని గావస్కర్‌ వ్యాఖ్యానించాడు. ‘కేవలం అంతర్జాతీయ మ్యాచుల్లోనే ఆడితే రోహిత్, విరాట్‌కు అవసరమైన ప్రాక్టీస్ దొరకదు. రాబోయే రెండేళ్లకు వారు ఎలా సిద్ధంగా ఉంటారో చెప్పలేకపోతే.. వారి అభిమానులు మరిన్ని చేదు వార్తలను వినాల్సి వస్తుంది. 2027 వన్డే ప్రపంచకప్‌కి బరిలోకి దిగుతామని బలంగా చెప్పాలనుకుంటే అంతర్జాతీయ వన్డేల్లోనే కాకుండా.. దేశవాళీలోనూ ఇద్దరూ ఆడాలి. విజయ్‌ హజారే వంటి ట్రోఫీల్లో పాల్గొనాలి’’ అని గావస్కర్ తెలిపాడు. అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాతో భారత్ వన్డే సిరీస్‌ ప్రారంభమవుతుంది. సో.. రోహిత్, విరాట్ భవితవ్యం టోర్నీలో వారి ఆటతీరుపైనే ఆధారపడి ఉందనే చర్చ జోరందుకుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నటుడు మోహన్ బాబు యూనివర్సిటీకి భారీ జరిమానా

పోకిరీల ఓవరాక్షన్‌.. చార్మినార్‌ వద్ద విదేశీ మహిళపై అసభ్యకర కామెంట్లు

Dhanush: సొంతూరులో ధనుష్ సందడి.. గ్రామస్తులకు నాన్‌ వెజ్‌ విందు

మన టాప్ 10 యూట్యూబర్లు వీరే.. వందల కోట్లలో సంపద

TGSRTC: మరింత స్మార్ట్‌గా తెలంగాణ ఆర్టీసీ.. త్వరలో గూగుల్‌ మ్యాప్స్‌తో అనుసంధానం