Dhanush: సొంతూరులో ధనుష్ సందడి.. గ్రామస్తులకు నాన్ వెజ్ విందు
తమిళ స్టార్ హీరో ధనుష్ తమిళనాడులోని తేని జిల్లా శంకాపురం స్వగ్రామంలో సందడి చేశారు. గ్రామస్తులకు విందు ఏర్పాటు చేశారు. ఆయన తాజా చిత్రం "ఇడ్లీ కడై" ..తెలుగులో ఇడ్లీ కొట్టు.. ఘన విజయం సాధించడంతో తన సొంతూరును సందర్శించి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలైన మొదటి రోజే మంచి పాజిటివ్ టాక్‌ను సంపాదించుకుంది.
తమిళనాట బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ విజయం సందర్భంగా ధనుష్ తన తల్లి, తండ్రి, ఇద్దరు కుమారులు, సోదరుడు సెల్వరాఘవన్‌తో కలిసి శంకాపురంలోని కరుప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం, గ్రామ ప్రజలందరికీ మాంసాహార విందును ఏర్పాటు చేసిన ధనుష్, వారితో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమానికి గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరై, తమ అభిమాన నటుడిని దగ్గరగా చూసి ఆనందపరవశులయ్యారు. గ్రామ ప్రజలతో కలిసి ధనుష్ సాధారణ వ్యక్తిలా మమేకమవడం స్థానికులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా తీసిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హాలీవుడ్ స్థాయికి ఎదిగిన నటుడైనా తన మూలాలను మరచిపోకుండా సాదాసీదాగా తన గ్రామానికి వచ్చి, గ్రామస్తులతో కలిసి పూజలు చేయడం, భోజనం చేయడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. ధనుష్‌ను చూసి చాలా మంది ఎంతో నేర్చుకోవాలని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మన టాప్ 10 యూట్యూబర్లు వీరే.. వందల కోట్లలో సంపద
TGSRTC: మరింత స్మార్ట్‌గా తెలంగాణ ఆర్టీసీ.. త్వరలో గూగుల్ మ్యాప్స్‌తో అనుసంధానం
ఐటీ రిఫండ్ ఇంకా మీ ఖాతాలో పడలేదా
15 మంది భార్యలతో విదేశీ ట్రిప్… పేదరికంలో దేశం… రాజు జల్సా
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వేలో ఏకంగా 8,850 పోస్టులు భర్తీ
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

