Loading video

Viral: కోహ్లీ బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో.. ఆగిన గుర్రం గుండె..! వైరల్ అవుతున్న వీడియో.

|

Nov 08, 2023 | 9:39 PM

టీమ్‌ ఇండియా మాజీ కెప్టెన్‌, పరుగుల రారాజు విరాట్‌ కోహ్లీ ఆదివారం తన 35వ పుట్టిన రోజును ఘనంగా జరుపుకున్నారు. ఇక అదే రోజు వన్డే ప్రపంచకప్‌లో భాగంగా టీమ్‌ ఇండియా.. సౌతాఫ్రికాతో తలపడింది. ఈ మ్యాచ్‌కు ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికైంది.ఈ సందర్భంగా స్టేడియంలో నిర్వాహకులు పటాసుల మోత మోగించారు. ఆ శబ్ధానికి ఒక్కసారిగా షాక్‌ అయిన పోలీసు శాఖకు చెందిన ‘వాయిస్‌ ఆఫ్‌ రీజన్‌’ అనే గుర్రం గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయింది.

టీమ్‌ ఇండియా మాజీ కెప్టెన్‌, పరుగుల రారాజు విరాట్‌ కోహ్లీ ఆదివారం తన 35వ పుట్టిన రోజును ఘనంగా జరుపుకున్నారు. ఇక అదే రోజు వన్డే ప్రపంచకప్‌లో భాగంగా టీమ్‌ ఇండియా.. సౌతాఫ్రికాతో తలపడింది. ఈ మ్యాచ్‌కు ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికైంది.ఈ సందర్భంగా స్టేడియంలో నిర్వాహకులు పటాసుల మోత మోగించారు. ఆ శబ్ధానికి ఒక్కసారిగా షాక్‌ అయిన పోలీసు శాఖకు చెందిన ‘వాయిస్‌ ఆఫ్‌ రీజన్‌’ అనే గుర్రం గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయింది. సాధారణంగా టీమ్‌ ఇండియా మ్యాచ్‌ గెలవగానే నిర్వాహకులు అన్ని రకాల అనుమతులతో స్టేడియంలో టపాసులు పేల్చడం తెలిసిందే. ఇక ఆదివారం సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో జట్టు గెలవడంతో పాటు కోహ్లీ బర్త్‌డే ఉండటంతో సాధారణం కంటే కాస్త ఎక్కువగానే పటాసులు కాల్చారు. రాత్రి 8:30 గంటల ప్రాంతంలో ఐదు నిమిషాల వ్యవధిలోనే ఏకంగా 150కి పైగా పటాసులు ఒక్కసారిగా గాల్లోకి ఎగిరాయి. దీంతో భారీ శబ్ధం రావడంతో స్టేడియానికి 100 మీటర్ల దూరంలో విధుల్లో ఉన్న కోల్‌కతా మౌంటెడ్ పోలీస్‌ శాఖకు చెందిన ‘వాయిస్ ఆఫ్ రీజన్’ అనే గుర్రం గుండెపోటుకు గురైనట్లు తెలిసింది. ఈ గుర్రం వయసు 5 ఏళ్ల 10 నెలలు. ఈ గుర్రం ఈ ఏడాది ప్రారంభంలో కోల్‌కతా పోలీసు శాఖలోకి చేరినట్లు అధికారులు తెలిపారు. ఆదివారం రాత్రి బాణాసంచా శబ్ధం విన్న ఆ గుర్రం ఒక్కసారిగా పరుగులు తీసినట్లు చెప్పారు. ఫుల్‌ స్పీడ్‌తో రోడ్డు వెంబడి అతివేగంగా పరిగెత్తిందని తెలిపారు. ఈ క్రమంలో రెండు, మూడు వాహనాలను ఢీ కొట్టి రోడ్డుపై కుప్పకూలినట్లు తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.