MS Dhoni: ధోని అభిమాని ఆత్మహత్య.! ధోనీపై అభిమానంతో సీఎస్కే రంగుతో నింపేసిన అభిమాని.

|

Jan 22, 2024 | 8:34 AM

కడలూరు జిల్లాలోని అరంగూర్‌లోని తన ఇంటిని చెన్నై సూపర్‌కింగ్స్‌’రంగులను తలపించేలా పసుపు రంగులో కలర్స్‌ వేసి, గోడలను క్రికెటర్ల బొమ్మలతో నింపేసి ధోనీపై అభిమానాన్ని చాటుకుని ఫేమస్‌ అయ్యాడు ధోనీ వీరాభిమాని గోపీ కృష్ణన్. అయితే తాజాగా 34 ఏళ్ల గోపి ఆత్మహత్య చేసుకోవడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఆయన గురువారం తెల్లవారుజామున ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం రాత్రి డబ్బు విషయంలో అదే ప్రాంతానికి చెందిన కొందరు ఆయనపై దాడి చేసినట్లు సమాచారం.

కడలూరు జిల్లాలోని అరంగూర్‌లోని తన ఇంటిని చెన్నై సూపర్‌కింగ్స్‌’రంగులను తలపించేలా పసుపు రంగులో కలర్స్‌ వేసి, గోడలను క్రికెటర్ల బొమ్మలతో నింపేసి ధోనీపై అభిమానాన్ని చాటుకుని ఫేమస్‌ అయ్యాడు ధోనీ వీరాభిమాని గోపీ కృష్ణన్. అయితే తాజాగా 34 ఏళ్ల గోపి ఆత్మహత్య చేసుకోవడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఆయన గురువారం తెల్లవారుజామున ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం రాత్రి డబ్బు విషయంలో అదే ప్రాంతానికి చెందిన కొందరు ఆయనపై దాడి చేసినట్లు సమాచారం. దీంతో మనస్తాపానికి గురైన అతను ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు జరిపిన దర్యాప్తులో తెలిసింది. అసహజ మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పొరుగు ఊర్లోని కొందరితో తన సోదరుడికి ఆర్థికపరమైన గొడవలు ఉన్నాయని గోపీ సోదరుడు రామ్ తెలిపారు. ఇటీవల వారితో జరిగిన గొడవలో గాయపడ్డాడని పేర్కొన్నారు. అతడి ఆత్మహత్యకు ఇదే కారణం అయి ఉంటుందని భావిస్తున్నట్టు వివరించారు. గోపికృష్ణన్‌కు భార్య అన్‌బరసి, కుమారులు కిషోర్, శక్తివేల్‌ ఉన్నారు. 10 రోజుల క్రితమే అతని భార్య ఓ కుమార్తెకు జన్మనిచ్చింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos