World Athletics Championship: చివరి పోరులో చేజారిన పతకం..ఊహించని ప్రమాదంలో ఆటగాడు..(వీడియో)
ప్రస్తుతం అమెరికాలో ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ పోటీలు జరుగుతున్నాయి. ఈ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు చెందిన నీరజ్ చోప్రా రజత పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించాడు.
ప్రస్తుతం అమెరికాలో ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ పోటీలు జరుగుతున్నాయి. ఈ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు చెందిన నీరజ్ చోప్రా రజత పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించాడు. కానీ ఇదే ఛాంపియన్‌షిప్‌లో మరో ఆటగాడు పొరపాటున ప్రమాదంలో చిక్కుకున్నాడు. ఈ టోర్నీలో చెక్ రిపబ్లిక్ ఆటగాడికి ప్రమాదం జరిగింది. పోల్ వాల్టర్ అయిన జిరి సియాకోరా. పతకం సాధించాలని తీవ్రంగా ప్రయత్నించాడు. కానీ, మధ్యలో అతనికి ప్రమాదం జరిగింది. నెట్టింట్లో షేర్ చేసిన ఈ వీడియో, అభిమానులను భావోద్వేగానికి గురి చేసింది.డెకాథ్లాన్ ఎనిమిదో ఈవెంట్‌లో జిరి తన సత్తాను చాటేందుకు సిద్ధమయ్యాడు. ఆ సమయంలోనే ఆయనకు ప్రమాదం జరిగింది. ఈ పోల్ వాల్టర్ తన మొదటి ప్రయత్నంలోనే 4.10 మీటర్ల దూరాన్ని అధిగమించాడు. ఆ తర్వాత 4.30 మీటర్ల దూరాన్ని కూడా అధిగమించాడు. మూడో ప్రయత్నం చేయబోతుండగా, అతని కర్ర విరిగిపోయి కింద పడిపోయాడు. దాంతో కొన్ని మీటర్లు మాత్రమే వెళ్లగలిగాడు. దీంతో జిరి తన పేరును ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. ఈ ప్రమాదంలో అతని చేయి విరిగినట్లు తెలుస్తోంది. జిరి ఒక జూనియర్ డెకాథ్లాన్ ఛాంపియన్. జిరి ఈ ఈవెంట్‌లో పతకం కోసం రేసులో ఉన్నాడు. కానీ, గాయం కారణంగా రేసు నుంచి తప్పుకున్నాడు. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో అతని ప్రయాణం ముగిసింది. ఇక ఈ ఈవెంట్‌లో ఫ్రెంచ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ కెవిన్ మీర్ విజేతగా నిలిచాడు .
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Python-cat: పిల్లిపై కొండచిలువ ఎటాక్.. సూపర్ షాకిచ్చిన పిల్లి.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో..
Cats fight: నడిరోడ్డుపై పిల్లుల ముష్టి యుద్ధం.. మధ్యలో దూరిన కాకి ఏం చేసిందో చూస్తే నవ్వులే..
ఇంటర్నెట్ కేబుల్ తో ఇంటిగుట్టు చౌర్యం
ఎవరినైనా తిట్టారో.. తిట్టుకు రూ.500 ఫైన్.. ఎక్కడో తెలుసా ??
టన్ను టమాటాలతో అభిషేకం! కూలీలకు పండగే పండగ
జువెలరీ షాపులో దొంగల బీభత్సం.. గన్ గురిపెట్టినా తగ్గని మహిళా
మురుగు కాలువలో 15 అడుగుల గిరి నాగు.. చూసి వణికిపోయిన గ్రామస్తులు
పెరట్లో పనిచేసుకుంటున్న వ్యక్తి.. వెనుక ఉన్నది చూసి షాక్
ఏపీ తొలి మహిళా అంబులెన్స్ డ్రైవర్గా కల్పన రికార్డు

