AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

45 ఏళ్ల తర్వాత తల్లిని కలిసిన కుమారుడు.. అసలు ట్విస్ట్ అక్కడే !

45 ఏళ్ల తర్వాత తల్లిని కలిసిన కుమారుడు.. అసలు ట్విస్ట్ అక్కడే !

Samatha J
|

Updated on: Jun 11, 2026 | 11:18 AM

Share

ఉత్తరాఖండ్‌లోని దౌలిగడ్‌ గ్రామంలోని నంది దేవి అనే వృద్ధురాలి ఇంటికి ఓ సాధువు భిక్ష కోసం వచ్చాడు. అతడ్ని తేరిపార చూసిన ఆమె భిక్ష కోసం ఇంటి ముందుకు వచ్చిన ఆ సాధువు 15 ఏళ్ల వయసులో తప్పిపోయిన తన కుమారుడు బుధి బల్లభ్‌ ఉపాధ్యాయ అని గుర్తించింది. దాదాపు 50 ఏళ్ల ఎదురుచూపుల తర్వాత తన కుమారుడిని చూడడంతో ఆమె భావోద్వేగానికి గురైంది. పట్టరాని ఆనందంతో కన్నీళ్లతో కౌగిలించుకుంది. అతడు తప్పిపోయిన తర్వాత ఏళ్ల పాటు ఆమె వెతికినా ఎటువంటి ఆచూకీ లభించలేదని ఆవేదన వ్యక్తం చేసింది.

15 ఏళ్ల వయసులో తప్పిపోయిన తన కుమారుడు 45 ఏళ్ల తర్వాత తిరిగి రావడంతో ఆ తల్లి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. తను మొదట ఇతర రాష్ట్రాలకు ట్రక్కులు రవాణా చేసే వారితో కలిసి పని చేశానని.. క్రమంగా గుళ్లు గోపురాలంటూ , ఆధ్యాత్మిక అన్వేషణ వైపు వెళ్లినట్టు బుధిబల్లభ్‌ గ్రామస్థులకు చెప్పాడు. ప్రస్తుతం రాజస్థాన్‌లోని ఓ ఆలయంలో సాధువుగా ఉంటున్నట్లు తెలిపాడు. సన్యాసం తీసుకొనే ముందు తల్లి నుంచి భిక్ష స్వీకరించాలని తన ఆధ్యాత్మిక గురువు సూచించారని.. ఆయన ఆదేశానుసారమే భిక్షను స్వీకరించడానికి ఇంటికి వచ్చానని చెప్పాడు. ఇన్నేళ్ల తర్వాత తన తల్లిని కలుసుకోవడం సంతోషంగా ఉందని.. భిక్ష స్వీకరించిన తర్వాత తిరిగి రాజస్థాన్‌కు వెళ్లిపోతానని తెలిపాడు. 45 ఏళ్లకు ఇంటికి తిరిగొచ్చిన అతడిని చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోయారు.

Follow Us