Ripened Banana: మాగిన అరటిపండ్లలో టన్నులకొద్దీ పోషకాలు.! మగవారికి మరింత ఉపయోగం..

|

Dec 09, 2024 | 1:01 PM

అరటి పండ్లంటే అందరూ ఇష్టంగా తింటారు. పైగా ఇది సీజన్‌తో సంబంధం లేకుండా.. అందరికీ అందుబాటులో ధరలో లభిస్తుంది. అంతేకాదు. అరటి పండు ఆరోగ్య పరంగా కూడా ఔషధ గని అంటారు. అయితే, అరటి పండు బాగా పండినప్పుడు చాలా మంది దానిని తినడానికి ఇష్టపడరు. కానీ, బాగా పండిన అరటి పండు వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టరని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

సాధార‌ణంగా పండిన అర‌టి పండ్లతో పోలిస్తే బాగా పండిన అరటి పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. కణ నష్టాన్ని నిరోధిస్తుంది. అంతర్గత డ్యామేజీలు, ఫ్రీ రాడికల్స్ వలన కలిగే కణాల నష్టాన్ని తగ్గించడానికి బాగా పండిన అరటి పండు ఉపయోగపడుతుంది. అరటి పండ్లు అల్సర్స్ సమస్యతో బాధపడుతున్న వారికి, అత్యంత లాభదాయకమైన పండుగా ఉంటుంది. అల్సర్ సమస్యతో ఉన్న వ్యక్తి నిస్సంకోచంగా ఈ పండిన అరటి పండును తినొచ్చంటున్నారు. అలాగే, పండిన అరటి పండ్లలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. మరియు సోడియం నిక్షేపాలు తక్కువగా ఉంటాయి. ఇది మీ కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించడంలో మేలుచేస్తుంది. ఒక మోస్తరుగా పండిన అర‌టి పండ్ల క‌న్నా బాగా పండిన అర‌టి పండ్లలోనే పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రాను మెరుగు ప‌రుస్తుంది. దీంతో హైబీపీ త‌గ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. బాగా పండిన అరటి పండ్లను తింటే శ‌క్తి బాగా ల‌భిస్తుంది. దీంతో అల‌సిపోకుండా ప‌నిచేయ‌వ‌చ్చు. వీటిలో ఐరన్ కూడా అధికంగా ఉంటుంది. ఇది అనీమియా సమస్యను నివారిస్తుంది. రక్త స్థాయిలను సహజ సిద్దంగా పెంచడానికి సహాయపడుతుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.