TGSRTC: మరింత స్మార్ట్‌గా తెలంగాణ ఆర్టీసీ.. త్వరలో గూగుల్‌ మ్యాప్స్‌తో అనుసంధానం

Updated on: Oct 08, 2025 | 4:58 PM

తెలంగాణ ప్రజా రవాణా వ్యవస్థ మరింత స్మార్ట్‌గా మారుతోంది. గూగుల్‌ మ్యాప్స్‌ ద్వారా బస్సు సర్వీసుల వివరాలు అందుబాటులో రానున్నాయి. ప్రయాణికులకు తమ గమ్యస్థానం ఎంత దూరంలో ఉందనే సమాచారం తెలుసుకునే వేసులుమాటు రానుంది. అంతే కాదు.. క్యూఆర్‌ ఆధారిత డిజిటల్‌ బస్సు పాస్‌, బస్సు టికెట్ల వివరాలు అందుబాటులోకి రానున్నాయి.

అయితే ప్రస్తుతం వినియోగిస్తున్న ‘గమ్యం’ యాప్‌తో బస్సు బయలు దేరిన టైం, ఏ మార్గంలో ఎక్కడుంది, బస్టాప్‌కు ఎప్పుడు చేరుకుంటుంది వంటి సమాచారం ఇస్తున్నప్పటకి కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయి. గూగుల్‌ మ్యాప్స్‌ సాయంతో మరింత కచ్చితత్వంతో బస్సుల రాకపోకల వివరాలను తెలుసుకోవచ్చనేది ఆర్టీసీ ఉన్నతాధికారుల ఆలోచనగా ఉంది. ఈ మేరకు టీజీఎస్‌ ఆర్టీసీ బస్సుల సమస్త సమాచారాన్ని గూగుల్‌కు అందించి, గూగుల్‌ మ్యాప్స్‌ సేవలు వాడుకోవాలని నిర్ణయించారు. వారం, పది రోజుల్లో గూగుల్‌కు ఆర్టీసీ బస్సుల డేటా అందించనున్నట్లు తెలుస్తోంది. దీపావళికల్లా హైదరాబాద్‌ సిటీ బస్సుల సమాచారం ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుంది. దశల వారీగా రాష్ట్రంలోని మిగతా బస్సుల సమాచారం గూగుల్‌ మ్యాప్స్‌లో పొందుపరిచే చర్యలు ప్రారంభిస్తారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఐటీ రిఫండ్ ఇంకా మీ ఖాతాలో పడలేదా

15 మంది భార్యలతో విదేశీ ట్రిప్‌… పేదరికంలో దేశం… రాజు జల్సా

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వేలో ఏకంగా 8,850 పోస్టులు భర్తీ

కొన్ని ఘటనలు నన్ను భయపెట్టాయి.. అందుకే పాపకు మాస్క్ వేస్తున్నాం

వారం రోజుల్లో అన్ని ప్రైవేటు కాలేజీలు బంద్‌ కానున్నాయా !! మళ్లీ ఏమైంది