States Alert: చైనాలో సీజనల్ ఫ్లూ కలకలం.! భారత్‌లో 6 రాష్ట్రాలు అలర్ట్‌..! వీడియో.

|

Nov 30, 2023 | 5:51 PM

చైనాలో గత కొంతకాలంగా చిన్నారుల్లో వ్యాపిస్తున్న శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు.. ప్రపంచ దేశాలను మళ్లీ ఆందోళనకు గురిచేస్తున్నాయి. మన దేశంలో ఆరు రాష్ట్రాలు అలర్ట్‌ అయ్యాయి. భారత ప్రభుత్వం రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది. రాజస్థాన్‌, కర్ణాటక, గుజరాత్‌, ఉత్తరాఖండ్‌, హరియాణా, తమిళనాడు రాష్ట్రాలు తమ ఆరోగ్య వ్యవస్థలను అలర్ట్‌ చేశాయి. శ్వాసకోశ సమస్యలు తలెత్తితే వాటిని పరిష్కరించేందుకు సంసిద్ధంగా ఉండాలని ఆసుపత్రులు, ఆరోగ్య సిబ్బందిని ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఆదేశించాయి.

చైనాలో గత కొంతకాలంగా చిన్నారుల్లో వ్యాపిస్తున్న శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు.. ప్రపంచ దేశాలను మళ్లీ ఆందోళనకు గురిచేస్తున్నాయి. మన దేశంలో ఆరు రాష్ట్రాలు అలర్ట్‌ అయ్యాయి. భారత ప్రభుత్వం రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది. రాజస్థాన్‌, కర్ణాటక, గుజరాత్‌, ఉత్తరాఖండ్‌, హరియాణా, తమిళనాడు రాష్ట్రాలు తమ ఆరోగ్య వ్యవస్థలను అలర్ట్‌ చేశాయి. శ్వాసకోశ సమస్యలు తలెత్తితే వాటిని పరిష్కరించేందుకు సంసిద్ధంగా ఉండాలని ఆసుపత్రులు, ఆరోగ్య సిబ్బందిని ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఆదేశించాయి. సీజనల్‌ ఫ్లూ పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కర్ణాటక ఆరోగ్యశాఖ సూచించింది. సీజనల్‌ ఫ్లూ లక్షణాలను వివరిస్తూ ఓ అడ్వైజరీ జారీ చేసింది. తుమ్ము, దగ్గు వచ్చినప్పుడు నోటిని, ముక్కును కవర్‌ చేసుకోవాలని, తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని సూచించింది. రద్దీ ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించాలని పేర్కొంది. పదే పదే చేతులతో ముఖాన్ని తాకవద్దని తెలిపింది. ఉత్తరాఖండ్‌లోని చమోలి, ఉత్తర్‌కాశీ, పిఠోర్‌గఢ్‌ జిల్లాలు చైనాతో సరిహద్దును పంచుకుంటున్నాయి. దీంతో ఆయా జిల్లాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించింది. దీంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు లేఖ రాసింది. ప్రజారోగ్య సంరక్షణ, ఆస్పత్రుల సంసిద్ధతపై తక్షణమే సమీక్ష జరపాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది. మానవ వనరులు, ఆస్పత్రి పడకలు, అవసరమైన ఔషధాలు, ఆక్సిజన్‌, యాంటీబాడీలు, పీపీఈ, టెస్టు కిట్ల వంటివి అందుబాటులో ఉండేలా చూసుకోవాలని తెలిపింది. అయితే చైనా మాత్రం శీతాకాలంలో వచ్చే సాధారణ శ్వాసకోస సమస్యలే తప్ప ఎలాంటి కొత్త వైరస్ గుర్తించలేదని చెబుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.

Follow us on