Cancer Injection: ఒక్క ఇంజెక్షన్‌.. క్యాన్సర్‌ మాయం.. ఫలిస్తున్న పరిశోధనలు..

Updated on: Sep 14, 2025 | 1:52 PM

క్యాన్సర్‌.. మందులేని మహమ్మారి. శస్త్ర చికిత్సలు, కీమో థెరపీ.. రేడియేషన్‌ ఇలా ఏ చికిత్సకూ లొంగని మొండిఘటం. ఈ చికిత్సలన్నీ పూర్తిస్థాయిలో ప్రభావం చూపడం చాలా అరుదు. అంతేకాదు ఈ చికిత్సల వల్ల వాటి దుష్ప్రభావాలు రోగులపై తీవ్రంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఒక్క ఇంజెక్షన్‌తో ఈ మహమ్మారికి చెక్‌ పెట్టవచ్చన్న వార్తలు ఊరట కలిగిస్తున్నాయి.

అవును ఒక్క ఇంజెక్షన్‌తో క్యాన్సర్‌ పూర్తిగా నయమవుతుందని పరిశోధనల్లో తేలింది. ఇది వైద్యరంగంలో ఆశాజనకంగా మారింది. సీడీ40 అగోనిస్ట్‌ యాంటీబాడీ రకానికి చెందిన ఈ మందు పేరు 2141.V11. నిజానికి గత 20 ఏళ్లుగా సీడీ40 అగోనిస్ట్‌ యాంటీబాడీ మందుల మీద ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇవి జంతువుల్లో మంచి ఫలితం చూపించాయి కానీ.. మనుషులపై దీని ప్రభావం అంతగా కనిపించటం లేదు. పైగా శరీరమంతా వాపు ప్రక్రియను ప్రేరేపించటం, ప్లేట్‌లెట్ల సంఖ్య పడిపోవటం, కాలేయం దెబ్బతినటం వంటి తీవ్ర దుష్ప్రభావాలూ పొంచి ఉంటున్నాయి. అందుకే మరికొన్ని పరిశోధనలు చేసి.. సురక్షితంగా మార్చొచ్చని రాక్‌ఫెల్లర్‌ యూనివర్సిటీ ప్రయోగశాలకు చెందిన జెఫ్రీ వి.రావెచ్‌ 2018లో గుర్తించారు. ఈ క్రమంలోనే 2141.V11 మందును రూపొందించారు. దీన్ని క్యాన్సర్‌ ప్రభావం ఎక్కువున్న 12 మందిపై పరీక్షించారు. వీరిలో ఆరుగురిలో కణితులు కుచించుకుపోయాయి. ఇద్దరిలో బ్లడ్‌ క్యాన్సర్‌, రొమ్ముక్యాన్సర్‌ పూర్తిగా నయమయ్యాయి. మందును నేరుగా ప్రయోగించిన కణితులు మాత్రమే కాకుండా ఇతర భాగాల్లో ఉన్న కణితుల సైజు కూడా తగ్గింది. ఇలా శరీరమంతా ప్రభావం చూపుతున్నట్టు ఒక ప్రయోగ పరీక్షలో తేలటం అరుదని పరిశోధకులు చెబుతున్నారు. ఇది ఊహించని చాలా గొప్ప విషయమని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇన్ని తెలివితేటలు ఏంటి భయ్యా.. మీ బైక్‌ను ఎవరూ కొట్టేయలేరు

అలారం శబ్దంతో గుండెపోటు..!

చలికాలంలో వెచ్చదనం, మండే ఎండల్లో కూల్.. ఈ ఇంటి డిజైన్‌ చూసారా?

ఆ దీవిలో అడుగు పెడితే చంపేస్తారు!

ఉపవాసంతో గుండె వ్యాధుల ముప్పు 135% ఎక్కువట