తల్లిదండ్రుల హత్య కేసులో కూతురు సురేఖ అరెస్ట్

Updated on: Jan 31, 2026 | 10:49 AM

వికారాబాద్ తల్లిదండ్రుల హత్య కేసులో నర్సు సురేఖను పోలీసులు అరెస్టు చేశారు. ప్రేమ వివాహాన్ని నిరాకరించినందుకు తల్లిదండ్రులను మత్తు ఇంజెక్షన్లతో చంపినట్లు విచారణలో తేలింది. అప్పుల డ్రామా క్రియేట్ చేసినా, ఇంట్లో సిరంజీలు దొరకడంతో అసలు నిజం బయటపడింది. ప్రస్తుతం సురేఖ రిమాండ్‌లో ఉండగా, ప్రియుడి పాత్రపై దర్యాప్తు కొనసాగుతోంది.

వికారాబాద్ జిల్లాలో తల్లిదండ్రులను హత్య చేసిన ఘటనలో కూతురు సురేఖను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సంగారెడ్డి జిల్లాలో నర్సుగా పనిచేస్తున్న సురేఖ, ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన వ్యక్తిని ప్రేమించింది. అతన్ని వివాహం చేసుకోవాలనుకుంటున్నానని తల్లిదండ్రులను కోరింది. వారు ఈ పెళ్లికి నిరాకరించడంతో దారుణానికి పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు. సురేఖ తాను పనిచేస్తున్న హాస్పిటల్ నుంచి సర్జరీ సమయంలో రోగులకు వినియోగించే మత్తు ఇంజెక్షన్లు, సిరంజీలను దొంగచాటుగా తీసుకొచ్చినట్లు విచారణలో తేలింది. మోకాళ్ల నొప్పులు తగ్గుతాయని, మంచి నిద్ర వస్తుందని చెప్పి ముందుగా తల్లి లక్ష్మికి ఇంజెక్షన్ ఇచ్చినట్లు వెల్లడైంది. ఆమె స్పృహ తప్పి పడిపోగానే అదే విధంగా తండ్రికీ ఇంజెక్షన్ ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఇద్దరూ కుప్పకూలిన తర్వాత అప్పుల బాధతో చనిపోయినట్టు డ్రామా క్రియేట్‌ చేసిన సురేఖ, సీపీఆర్ కూడా చేశానని అయినా ఫలితం దక్కలేదని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసింది. అయితే ఇంట్లో రక్తపు సిరంజీలు కనిపించడంతో కుటుంబ సభ్యులకు అనుమానం కలిగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో సురేఖ పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులు లోతుగా విచారించగా అసలు విషయం బయటపడింది. ఈ ఘటనకు సంబంధించి ప్రియుడికి ఏమీ తెలియదని సురేఖ చెప్పినట్టు పోలీసులు తెలిపారు. ప్రియుడి పాత్రపై కూడా దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బిర్యానీ కోసం ఆశగా లోపలి వెళ్ళాడు.. తిని బయటకి రాగానే ??

ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్ట్.. KCR రిక్వెస్ట్ ను రిజెక్ట్ చేసిన SIT

చంద్రుడికి పొంచి ఉన్న ముప్పు.. భూమికి ప్రమాదం?

కదిరి లక్ష్మీనరసింహస్వామి రథానికి తాళ్లరేవు కొబ్బరితాడు

సందర్శకులను కట్టి పడేస్తున్న అరుదైన పుష్పాల ఫ్లవర్‌ షో