Shashi Tharoor: ఇదేం తీరు.. కొలంబియా వైఖరిని ఆ దేశంలో ఉండే తప్పుపట్టిన శశిథరూర్
ఉగ్రవాదంపై పాకిస్థాన్ అనుసరిస్తున్న విధానాన్ని ఎండగట్టేందుకు భారత పార్లమెంటరీ అఖిలపక్ష ప్రతినిధి బృందాలు పలు దేశాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అందులో శశిథరూర్ నాయకత్వంలోని బృందం ప్రస్తుతం కొలంబియాకు వెళ్లింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్‌లో ప్రాణాలు కోల్పోయిన వారికి కొలంబియా ప్రభుత్వం సంతాపం తెలపడంపై కాంగ్రెస్ నాయకుడు శశిథరూర్ అసహనం వ్యక్తం చేశారు.
కొలంబియా తీరుపై ఎంపీ శశిథరూర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆపరేషన్ సిందూర్‌పై తమ స్పందన బాలేదు..అంటూ కొలంబియాకు ముఖమ్మీదే చెప్పేశారు. ఉగ్రవాదంపై కొలంబియా వైఖరి సరిగ్గా లేదని ఆ దేశ మీడియా ముందే స్పష్టంగా చెప్పేశారు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్. ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్తాన్‌లో మరణించిన వారికి కొలంబియా సంతాపం తెలిపిన విషయాన్ని గుర్తుచేస్తూ.. కొలంబియా స్పందన పట్ల భారత్ తీవ్ర అసంతృప్తిగా ఉందన్నారు. చనిపోయిన ఉగ్రవాదులకు సంతాపం తెలపడమేంటని ప్రశ్నించారు. పహల్గామ్ దాడిలో చనిపోయిన అమాయక పర్యాటకులు ఆపరేషన్ సిందూర్ లో చనిపోయిన ఉగ్రవాదులు ఒకటి కాదనే విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. ఉగ్రవాదులను పంపేవారికి, ఆ ఉగ్రవాదులను ఎదుర్కొని ఆత్మరక్షణ కోసం ప్రతిదాడులు చేసేవారికి చాలా వ్యత్యాసం ఉందన్నారు. ఆ రెండు వర్గాలను ఒకే గాటిన కట్టడం సరికాదన్నారు శశిథరూర్.
ఉగ్రవాదంపై పాకిస్థాన్ అనుసరిస్తున్న విధానాన్ని ఎండగట్టేందుకు పలు దేశాల పర్యటనలో భాగంగా.. శశిథరూర్ నాయకత్వంలోని బృందం ప్రస్తుతం కొలంబియాకు వెళ్లింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..

