పెరుగుతున్న చలి తీవ్రత.. రానున్న రెండు రోజుల్లో మరింత పెరిగే అవకాశం
తెలుగు రాష్ట్రాలు, ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా చలి తీవ్రత, పొగమంచు, కాలుష్యం పెరిగాయి. పటాన్‌చెరులో 7°, విశాఖ ఏజెన్సీలో 4°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తోంది. ఢిల్లీలో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. రాబోయే రోజుల్లో చలి మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
చలి చంపేస్తోంది. ఉదయాన్నే అడుగు బయట పెట్టారో అంతే సంగతులు అంటూ హెచ్చరిస్తోంది వాతావరణశాఖ. గత రెండురోజులతో పోల్చుకుంటే చలి ఇంకా పెరిగింది. ఒకవైపు చలి, మరోవైపు కాలుష్యం డేంజర్‌బెల్స్ మోగిస్తున్నాయి. ఈ అసాధారణ ప్రతికూల వాతావరణం ఇంకెన్నిరోజులు..? వాతావరణశాఖ ఏం చెబుతోంది.. ఇప్పుడు చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత కొనసాగుతోంది. గత రెండ్రోజులతో పోల్చితే ఇవాళ చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. తెలంగాణలో చాలాచోట్ల సింగిల్ డిజిట్ టెంపరేచర్స్ నమోదయ్యాయి. సాధారణం కంటే నాలుగైదు డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణలోని పటాన్‌చెరు, ఆదిలాబాద్‌లో 7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యాయి. మెదక్, రాజేంద్రనగర్, హనుమకొండలో 9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. హైదరాబాద్, నిజామాబాద్, హయత్‌నగర్, రామగుండం, దుండిగల్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్, భద్రాచలంలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. పొగమంచు కారణంగా వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. రాబోయే రోజుల్లో చలి తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేసింది వాతావరణశాఖ. ఏపీలోనూ చలి చంపేస్తోంది. రోజురోజుకి చలి తీవ్రత పెరుగుతోంది. విశాఖ ఏజెన్సీలోని డుంబ్రిగూడలో అత్యల్పంగా 4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఏజెన్సీ ప్రాంతాల్లో నీళ్లు గడ్డకట్టేంతగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. అల్లూరి, పార్వతీపురం, శ్రీసత్యసాయి, కర్నూలు, అనంతపురం, అన్నమయ్య, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో 12 డిగ్రీల్లోపే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పాడేరు ఏజెన్సీలో చలి తీవ్రత మరింతి పెరిగింది. మరోవైపు దట్టంగా పొగమంచు కమ్మేయడంతో పగలు కూడా లైట్లు వేసుకొని వెళ్తున్నారు వాహనదారులు. మినుములూరులో 4 డిగ్రీలు, అరకులో 5, పాడేరు 6, చింతపల్లిలో 6.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు తమోదయ్యాయి. వీకెండ్ కావడంతో ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు పర్యాటక ప్రాంతాలకు పోటెత్తుతున్నారు సందర్శకులు. మాడగడ, వంజంగి మేఘాల కొండలకు సందర్శకుల తాకిడి పెరిగింది. పర్యాటకులతో అరకు లోయ కిటకిటలాడుతోంది. ఢిల్లీని పొగమంచు దట్టంగా కమ్మేసింది. ఓవైపు కాలుష్యం.. మరోవైపు పొగమంచుతో దారుణ పరిస్థితులు ఏర్పడ్డాయి. విమానాలు, రైళ్లు, వాహన రాకపోకలపై ప్రభావం చూపుతోంది. రోడ్లపై విజిబులిటీలేక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీలోని అన్ని ప్రాంతాల్లో సగటున 400 పాయింట్లపైనే AQI ఉంది. రోజంతా పొగమంచు ఉండొచ్చంటూ IMD రెడ్‌అలర్ట్ జారీ చేసింది. యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్‌కి వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉత్తర భారతాన్ని దట్టమైన పొగమంచు కమ్మేసింది. పంజాబ్, హర్యానా, యూపీ, మధ్యప్రదేశ్, బిహార్‌లో ప్రభావం ఎక్కువగా ఉంది. కాలుష్యం, పొగమంచుతో 100 మీటర్లకు విజిబులిటీ తగ్గింది. దట్టమైన పొగమంచు కారణంగా విమానాల రాకపోకలు ఆలస్యమయ్యే అవకాశముందని ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ అథారిటీ ప్రకటించింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఏలియన్ల “ఏరియా 51′ గుట్టు విప్పే సినిమా ??
తండ్రితో గొడవ పడి భారత్‌లోకి పాక్ మహిళ
Samantha: సమంత న్యూ ఇయర్ రిజల్యూషన్ పోస్ట్ వైరల్.. తప్పులు దిద్దుకుంటా
Himalayas: మంచు లేక బోసిపోయిన హిమాలయాలు
ఉద్యోగం చేస్తూనే కుబేరులు కావొచ్చా ?? సంపద సృష్టి రహస్యం ఇదే
