AP News: ఆలయాల ఎదురుగా కుక్కల కళేబరాలు.. అసలు స్టోరీ వింటే కళ్లు తేలేస్తారు..

Updated on: Mar 22, 2025 | 1:43 PM

మూడు రోజుల కిందట ఆలయాలు ఎదురుగా ఉన్న వీధి కుక్కలు వరుసగా చనిపోయాయి. వాటి కళేబరాలు అక్కడ దర్శనమిచ్చాయ్. అసలేం జరిగిందో..? ఏంటో.? తెలియదు.. ఈలోగా అనూహ్యం సంఘటన ఎదురైంది. అసలేం జరిగిందంటే.. ఈ స్టోరీలో తెలుసుకుందామా.. ఓ సారి లుక్కేయండి.

కృష్ణాజిల్లా తోట్లవల్లూరు మండలం పెనమకూరు గ్రామంలోని దేవాలయాల్లో వరుసగా దొంగతనాలు జరిగాయి. స్థానిక గంగానమ్మ గుడి, వీరమ్మ గుడిలో దొంగతనాలు జరగ్గా.. రామాలయంలో దొంగతనానికి విఫలయత్నం చేశారు దుండగులు. గంగానమ్మ అమ్మవారి బంగారు సూత్రాలు అపహరించారు. అలాగే వీరమ్మ ఆలయంలో హుండీ దొంగతనం జరిగింది. పక్కా ప్రణాళికతో ఈ దొంగతనానికి స్కెచ్ వేశారు దుండగులు. ఈ దొంగతనాలతో.. మరో సంచలన విషయం బయటపడింది. దేవాలయాల వద్ద ఉంటున్న వీధి కుక్కలను మూడు రోజుల క్రితమే మందు పెట్టి చంపినట్టు గుర్తించారు. దీంతో గ్రామస్తులలో తీవ్ర భయాందోళన నెలకొంది.