బైక్‌పై వచ్చి ఇద్దరు వ్యక్తులు.. కట్ చేస్తే.. ఓ మహిళ దగ్గరకు వచ్చి..
సంగారెడ్డి జిల్లాలో ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని చైన్ స్నాచింగ్ ఘటనలు పెరుగుతున్నాయి. తాజాగా, గడ్డపోతారంలో 58 ఏళ్ల బాయమ్మ మెడికల్ షాప్‌కు వెళ్తుండగా బైక్‌పై వచ్చిన దుండగులు ఆమె మెడలోని 4 తులాల బంగారు గొలుసును లాక్కెళ్లారు. ఈ ఘటన సీసీ కెమెరాల్లో రికార్డు కాగా, బొల్లారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహిళలు అప్రమత్తంగా ఉండాలి.
ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తున్నారు కొంతమంది దుండగులు..రోడ్ల పై ఒంటరిగా వెళ్తున్న మహిళల మెడలోంచి బంగారు గొలుసులు లాకెళ్తున్నారు..తాజాగా ఇలాంటి ఘటనే సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.. సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం మున్సిపల్ పరిధిలో నారబోయిన బాయమ్మ (58) అనే మహిళ మందులు కొనేందుకు మెడికల్ షాప్ కి వెళ్తుండగా.. బైక్ మీద వచ్చిన ఇద్దరు అగంతకులు బాయమ్మ అనే మహిళను కింద పడేసి..ఆమె మెడలో ఉన్న నాలుగు తులాల బంగారు గొలుసును లాక్కెళ్లారు దుండగులు…వెంటనే ఆమె అరుపులు విని స్థానికులు అప్రమత్తం అయ్యేలోపు దుండగులు బైక్ ఎక్కి అక్కడి నుండి జారుకున్నారు…ఈ ఘటనలో మహిళ స్వల్ప గాయాలతో బయట పడింది..కాగా దుండగులు బైక్ పై పారిపోయే విజవల్స్ అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.. బాధిత మహిళ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నరు బొల్లారం పోలీసులు…
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గ్రీన్‌లాండ్ కు సైనిక బలగాల తరలింపు
Gold Price Today: చుక్కల్ని తాకుతున్న బంగారం, వెండి ధర.. మంగళవారం ఎంత పెరిగిందంటే
Weather Update: తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు.. వెదర్ రిపోర్ట్