అమ్మ బాబోయ్‌.. 4.5 km పొడవైన రైలును చూసారా?

Updated on: Aug 13, 2025 | 6:49 PM

భారతీయ రైల్వే సరుకు రవాణా రంగంలో రికార్డ్‌ సృష్టించింది. 4.5 కిలో మీటర్ల పొడవైన రైలును విజయవంతంగా నడిపింది. ఈ ప్రత్యేక సరుకు రవాణా రైలుకు రుద్రాస్త్ర అని పేరు పెట్టారు. రుద్రాస్త్ర తూర్పు మధ్య రైల్వే DDU డివిజన్‌ గంజ్‌ఖ్వాజా స్టేషన్ నుంచి బయలుదేరి 200 కి.మీ ప్రయాణం 5 గంటల్లో పూర్తి చేసింది. ఈ రైలుకి ఆరు రైళ్లకు సరిపడా 6 ఖాళీ బాక్సన్ రేక్‌లు, 354 వ్యాగన్లు, 7 శక్తివంతమైన ఇంజిన్లు కలిపారు.

200 కి.మీ ప్రయాణాన్ని 5 గంటల్లో పూర్తి చేసి గర్హ్వా రోడ్ స్టేషన్‌కు చేరుకుంది. తూర్పు మధ్య రైల్వే DDU డివిజన్ ధన్‌బాద్ డివిజన్‌కు బొగ్గు రవాణాలో సహాయపడుతుంది. గూడ్స్ రైళ్ల కోచ్‌లను తనిఖీ చేయడం, మరమ్మత్తులు చేయడం ఇక్కడ పెద్ద ఎత్తున జరుగుతుంది. కోచ్‌లను మొదట మరమ్మతులు చేసి, ఆపై సిద్ధం చేసిన కోచ్‌లను అసెంబుల్ చేసి, రైలును లోడింగ్ కోసం పంపుతారు. ఒక రకంగా చూస్తే సరుకు రవాణా సామర్థ్యాన్ని రుద్రాస్త్ర పెంచింది. ఇది సమయం ఆదా చేయడంతో పాటు రైల్వే మార్గంలో ట్రాఫిక్‌ను తగ్గించింది. 6 సరుకు రవాణా రైళ్లను విడివిడిగా నడిపితే, 6 వేర్వేరు సమయాలు, సిబ్బంది, మార్గాలు అవసరమవుతాయి. అయితే ఈ ప్రయోగం ఈ పనిని ఒకేసారి పూర్తి చేసింది. ఇటువంటి సూపర్ లాంగ్ సరుకు రవాణా రైళ్ల నిర్వహణ భవిష్యత్తులో లాజిస్టిక్స్ వేగం, సామర్థ్యం రెండింటినీ పెంచుతుందని రైల్వే అధికారులు అంటున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విమర్శల ధాటికి వివరణ ఇచ్చుకున్న హీరోయిన్

బిగ్‌ బాస్‌లోకి పహల్గామ్ ఉగ్రదాడి బాధితురాలు

మహేష్ సినిమాలో.. రావు బహదూర్‌గా సత్యదేవ్‌

NTR కాదు.. విలన్‌గా వార్‌2లో సర్‌ప్రైజ్ స్టార్

ప్రభాస్ చెల్లి చేసిన పనికి.. నిరాశలో రెబల్ స్టార్ ఫ్యాన్స్‌