కలవరపెడుతున్న కొత్త ఇన్ఫెక్షన్.. గుర్తించకపోతే మరణమే వీడియో

Updated on: Aug 02, 2025 | 1:53 PM

రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రోజుల తరబడి కురుస్తున్న వానలు, ముసురు వాతావరణం కారణంగా పలుచోట్ల జనం అనారోగ్యం పాలవుతున్నారు. ఈ క్రమంలో.. ముంబై వాసులను టేప్‌వామ్ ఇన్ఫెక్షన్ కలవరపెడుతోంది. మహారాష్ట్రతోపాటు పలు రాష్ట్రాలకు విస్తరిస్తూ.. ప్రజలను వణికిస్తోంది. బాగా ఉడికించని మాంసం, కలుషిత నీటి ద్వారా వ్యాపించే ఈ ఇన్‌ఫెక్షన్ వల్ల మెదడు పనితీరు దెబ్బతింటుంది. న్యూరో సిస్టిసెర్కోసిస్ గా పిలిచే ఈ ఈ ఇన్ఫెక్షన్ తాలూకూ కేసులు ఇప్పుడు క్రమంగా మహారాష్ట్ర, పలు ఇతర రాష్ట్రాలలో పెరగటం పట్ల నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ సీజన్‌లో ఆకుకూరలు, కూరగాయల మీద పేరుకుపోయిన టేప్ వామ్ గుడ్లు..వంటకాలు బాగా ఉడికించని సందర్భాల్లో శరీరంలోకి చేరతాయి. ఆహారం తీసుకున్న తర్వాత, ఈ పరాన్నజీవులు మెదడుకు వలసపోతాయి. అక్కడ సంతానోత్పత్తి చేస్తాయి. దీంతో.. మనిషికి తరచూ మూర్ఛ, భరించలేని తలనొప్పి, కోలుకోలేని నాడీ సమస్యలు తలెత్తుతాయి. వర్షాకాలంలో తరచుగా వచ్చే వరదలు, పారిశుధ్యం సరిగా లేకపోవడం వల్ల ఈ ప్రమాదం మరింత పెరుగుతుంది. బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్న పిల్లలు, వ్యక్తులను దీని ముప్పు మరింత ఎక్కువని నిపుణులు చెబుతున్నారు.ప్రపంచ ఆరోగ్య సంస్థ , సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం, న్యూరోసిస్టిసెర్కోసిస్ అనేది కేంద్ర నాడీ వ్యవస్థను నియంత్రించగల ఇన్ఫెక్షన్. సరైన టైంలో గుర్తించి, దీనికి చికిత్స చేయకపోతే, ఇన్ఫెక్షన్ మెదడుకు చేరి ప్రాణాంతకంగా మారుతుంది. ఇప్పటికే లాటిన్ అమెరికా, ఆగ్నేయాసియా, భారతదేశం, నేపాల్, చైనా, ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలలో ఈ వైరస్ పలు మరణాలకు కారణమవుతోంది.

మరిన్ని వీడియోల కోసం :

నీ కష్టం పగోడికి కూడా రావద్దు బ్రో .. వైరల్ అవుతున్న వీడియో

ఇదెక్కడి ఆచారం.. ఆ దుమ్ము,ధూళితో రోగాలన్నీ మాయం వీడియో

రేయ్ ఎంత పని చేసార్రా.. గబ్బిలాల మాంసంతో చిల్లీ చికెనా? వీడియో