Mumbai Attack: లష్కరే తోయిబా విషయంలో ఇజ్రాయెల్ కీలక నిర్ణయం.! వీడియో.
ముంబయిలో 26/11 ఉగ్రదాడి జరిగి 15 ఏళ్లు గడిచాయి. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ దాడులకు కారణమైన లష్కరే తోయిబాను ఉగ్రసంస్థగా గుర్తించి నిషేధించింది. ఢిల్లీలోని ఇజ్రాయెల్ ఎంబసీ ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ రకమైన అభ్యర్థనను భారత్ కోరనప్పటికీ తాము స్వతహాగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. ముంబయిలో నవంబర్ 11, 2008న ఉగ్రవాదులు వరుసదాడులకు పాల్పడ్డారు.
ముంబయిలో 26/11 ఉగ్రదాడి జరిగి 15 ఏళ్లు గడిచాయి. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ దాడులకు కారణమైన లష్కరే తోయిబాను ఉగ్రసంస్థగా గుర్తించి నిషేధించింది. ఢిల్లీలోని ఇజ్రాయెల్ ఎంబసీ ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ రకమైన అభ్యర్థనను భారత్ కోరనప్పటికీ తాము స్వతహాగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. ముంబయిలో నవంబర్ 11, 2008న ఉగ్రవాదులు వరుసదాడులకు పాల్పడ్డారు. పదిమంది ఉగ్రవాదులు సముద్రమార్గం గుండా ముంబయిలోకి చొరబడ్డారు. ఆ తర్వాత బృందాలుగా విడిపోయి ఛత్రపతి శివాజీ టెర్మినల్ స్టేషన్, తాజ్ హోటల్, నారిమన్ లైట్ హౌస్ సహా ఇలా 12 చోట్ల కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడుల్లో ఉగ్రవాదులతో కలిపి మొత్తం 175 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో భారతీయులతో పాటు మరో 14 దేశాలకు చెందిన పౌరులు ఉన్నారు. ఇందులో నలుగురు ఇజ్రాయెల్ దేశస్థులున్నారు. ప్రస్తుతం ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకర యుద్ధం సాగుతోంది. అక్టోబర్ 7న హమాస్ బృందం ఇజ్రాయెల్‌లోకి చొరబడి కాల్పులకు తెగబడ్డారు. అనంతరం ఇజ్రాయెల్ యుద్ధానికి దిగింది. ఈ యుద్ధంలో ఇప్పటివరకు ఇజ్రాయెల్ వైపు 1200 మంది మరణించగా 12,700 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
ఆస్తులు పంచి అంత్యక్రియల ఖర్చులు అకౌంట్లో వేసి. కుటుంబం ఆత్మహత్య
ప్రాణం తీసిన బంగీజంప్.. ఏం జరిగిందంటే..
వర్క్ ఫ్రమ్ బైక్.. అంత ఆత్రం ఎందుకు బాబూ..బ్రతకాలని లేదా నీకు!
అస్థిపంజరాలు చెప్పిన లక్షల ఏళ్ల నాటి రహస్యం..
92 ఏళ్ల వయసులో 30 ఏళ్ల ఫిట్నెస్..!
అక్కడ కొండచిలువల వేట చాలా ఫేమస్!
12 రోజుల పాటు కదలని ట్రాఫిక్ జామ్.. ఎక్కడ? ఎప్పుడు?

