యూరిన్‌ ఇన్‌ఫెక్షన్‌తో ఇబ్బంది పడుతున్నారా.. ఇలా ట్రై చేయండి

|

Jul 20, 2024 | 8:55 PM

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనేది మహిళల్లో వచ్చే సర్వసాధారణమైన ఆరోగ్య సమస్య. ఇది ఒక రకమైన సాధారణ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లలో ఒకటి. దాదాపు 50 నుంచి 60శాతం మంది మహిళలు ఇలాంటి UTI సమస్యను అనుభవిస్తారు. ఆడవాళ్లలో ఎక్కువగా కనిపించే UTI సమస్య అనేది ప్రాణాంతక పరిస్థితి కానప్పటికీ.. తీవ్రమైన ఇన్‌ఫెక్షన్ అనేక రకాలుగా ఇబ్బందికి గురిచేస్తుంది. పదే పదే మూత్రవిసర్జన చేయాలనే భావన కలుగుతుంది.

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనేది మహిళల్లో వచ్చే సర్వసాధారణమైన ఆరోగ్య సమస్య. ఇది ఒక రకమైన సాధారణ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లలో ఒకటి. దాదాపు 50 నుంచి 60శాతం మంది మహిళలు ఇలాంటి UTI సమస్యను అనుభవిస్తారు. ఆడవాళ్లలో ఎక్కువగా కనిపించే UTI సమస్య అనేది ప్రాణాంతక పరిస్థితి కానప్పటికీ.. తీవ్రమైన ఇన్‌ఫెక్షన్ అనేక రకాలుగా ఇబ్బందికి గురిచేస్తుంది. పదే పదే మూత్రవిసర్జన చేయాలనే భావన కలుగుతుంది. మూత్రవిసర్జన చేసేటప్పుడు మంట, కడుపు నొప్పి కలిగిస్తుంది. ఈ సమస్యతో బాధపడుతున్నప్పుడు తప్పక వైద్యులను సంప్రదించాల్సిందే. వైద్యుల సూచన మేరకు మెడిసిన్‌ తీసుకోవాలి. అయితే ఒకవేళ మీ సమస్య ప్రాధమిక దశలో ఉన్నట్టయితే ఇంట్లోనే కొన్ని హోమ్‌ రెమిడీస్‌తో మీ సమస్యనుంచి ఉపశమనం పొందవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. నీరు.. ఆరోగ్యానికి ఓ వరం అని చెప్పవచ్చు. UTIతో సహా అన్ని ఆరోగ్య సమస్యలకు నీరు కీలక పరిష్కారం. హైడ్రేటెడ్‌గా ఉండడం వల్ల UTI సమస్యను తగ్గించుకోవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు. తరచూ నీరు తాగడం వల్ల మూత్రం పలుచన అవుతుంది. దాంతో మీరు ఎక్కువగా మూత్ర విసర్జన చేసేలా సహాయం చేస్తుంది. ఇన్ఫెక్షన్‌ను ప్రేరేపించే బ్యాక్టీరియాను ఇది శరీరం నుంచి బయటకు పంపుతుంది. మన శరీరానికి సరిపడా మంచినీరు తాగడం యూరిన్ ఇన్ఫెక్షన్ సమస్యకు ఉత్తమ ఇంటి నివారణ.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రెండే రెండు ఖర్జూరాలతో ఫుల్ ఎనర్జీ.. రెచ్చిపోతారంతే..!

ఇకపై ఈ స్టేషన్లలో నారాయణాద్రి, విశాఖ, చెన్నైఎక్స్‌ప్రెస్‌లు ఆగవు

కోరుకున్న రొట్టె తింటే.. కోరిక నెరవేరుతుందట

Follow us on