ఎరుపు రంగు అందించే ఆత్మవిశ్వాసం ఆకర్షణే వేరు

Updated on: Dec 18, 2025 | 5:38 PM

ఎరుపు లిప్‌స్టిక్ మహిళల ఆత్మవిశ్వాసాన్ని, వ్యక్తిత్వాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో ఈ కథనం వివరిస్తుంది. ఇది ధైర్యం, శక్తి, నాయకత్వ లక్షణాలను హైలైట్ చేస్తుందని, ఇతరులు వారిని గౌరవించేలా చేస్తుందని సైకాలజిస్టులు చెబుతున్నారు. కెరీర్‌లో విజయం సాధించడానికి, ఆకర్షణీయంగా కనిపించడానికి ఎరుపు లిప్‌స్టిక్ దోహదపడుతుందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.

ముఖంలో పెదవులు అందరి దృష్టిని ఆకర్షిస్తాయి. పెదాలకి చిరునవ్వు తోడైతే ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. అమ్మాయిలు ఎంచుకునే లిప్‌స్టిక్‌ రంగు వారి వ్యక్తిత్వాన్ని అంచనా వేయడంలో ఇతరులను ప్రభావితం చేస్తుందని సైకాలజిస్ట్‌లు అంటున్నారు. ఎరుపు రంగు లిప్‌స్టిక్‌ వారి ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుందని ఆ మహిళను గౌరవించి ఆమె మాటలకు విలువిచ్చేవారు ఉంటారని అంటున్నారు. ఎరుపు రంగుకి మన మెదడు ఆకర్షితమవుతుంది. ఎరుపు రంగు లిప్ స్టిక్ లో మహిళలు ధైర్యంగా, శక్తివంతంగా, నాయకురాళ్లుగా కనిపిస్తారని చెబుతున్నారు మానసిక నిపుణులు. ఎరుపు రంగును చూడగానే మన మెదడు ఉత్సాహానికి ధైర్యానికి నమ్మకానికి శక్తికి ముడిపెడుతుందట. ప్రత్యేకించి ఓ మహిళ శక్తిని ఎరుపు రంగు హైలైట్‌ చేస్తుందన్నది నిపుణుల మాట. కెరియర్‌ పరంగా దూసుకెళతారని సాహసోపేత నిర్ణయాలు రిస్క్‌ లాంటివి తీసుకోవడానికి వెనకాడరని అంటున్నారు. ఇక వారు అనుకున్నది సాధించి తీరతారని చెబుతున్నారు. ఎరుపు రంగు మహిళకు కాంతిని తేజస్సును అందిస్తుందట. ఆమెను ఆకర్షణీయంగా చూపిస్తుందని సైన్స్ కూడా నిరూపిస్తోంది. ఈ అధ్యయన ఫలితాలు పర్సనాలిటీ అండ్‌ సోషల్‌ సైకాలజీ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Ravi Teja: కరెక్ట్ ట్రాక్ లోకి వచ్చిన రవితేజ.. వరుస ఫ్లాపుల తర్వాత ఇప్పుడు బోధపడిందా

ఒక్క పాటతో మారిపోతున్న సినిమాల జాతకాలు..

Demon Pavan: అప్పుడు ఇజ్జత్‌ పోగొట్టుకున్నాడు.. ఇప్పుడు హీరోలా నిలబడ్డాడు

Bharani: గెలవకున్నా పర్లేదు.. ఆ రేంజ్‌లో రెమ్యునరేషన్‌ దక్కించున్న భరణి

నటిని కిడ్నాప్ చేసిన ఆమె భర్త !! కట్ చేస్తే ??