బస్సు ​అటాక్ టీఆర్ఎఫ్ పనే.. మరిన్ని దాడులు చేస్తామన్న పాక్ ఉగ్ర సంస్థ

|

Jun 11, 2024 | 10:45 PM

జమ్ముకశ్మీర్‌ రియాసీ జిల్లాలో యాత్రికుల బస్సుపై జరిగిన దాడికి పాకిస్థాన్‌ నుంచి కార్యకలాపాలు నిర్వహించే ద రెసిస్టెంట్‌ ఫ్రంట్‌ ఉగ్ర సంస్థ బాధ్యత వహించింది. కశ్మీర్‌ ప్రాంతంలో అలాంటి ఉగ్రదాడులు మరిన్ని చేస్తామని ముష్కర సంస్థ హెచ్చరించింది. పర్యాటకులు, స్థానికేతరులే లక్ష్యంగా దాడులకు తెగబడతామని భీరాలు పలికిన టీఆర్ఎఫ్ ఇది ఆరంభం మాత్రమే అని చెప్పింది. ఉగ్రదాడి నేపథ్యంలో రియాసిలో హై అలెర్ట్‌ కొనసాగుతోంది.

జమ్ముకశ్మీర్‌ రియాసీ జిల్లాలో యాత్రికుల బస్సుపై జరిగిన దాడికి పాకిస్థాన్‌ నుంచి కార్యకలాపాలు నిర్వహించే ద రెసిస్టెంట్‌ ఫ్రంట్‌ ఉగ్ర సంస్థ బాధ్యత వహించింది. కశ్మీర్‌ ప్రాంతంలో అలాంటి ఉగ్రదాడులు మరిన్ని చేస్తామని ముష్కర సంస్థ హెచ్చరించింది. పర్యాటకులు, స్థానికేతరులే లక్ష్యంగా దాడులకు తెగబడతామని భీరాలు పలికిన టీఆర్ఎఫ్ ఇది ఆరంభం మాత్రమే అని చెప్పింది. ఉగ్రదాడి నేపథ్యంలో రియాసిలో హై అలెర్ట్‌ కొనసాగుతోంది. భారీగా రంగంలోకి దిగిన సైన్యం డ్రోన్లతో ముష్కర వేటను ముమ్మరం చేసింది. వైష్ణోదేవి ఆలయాన్ని దర్శించి మరో మందిరానికి వెళ్తున్న ఉత్తర్ ప్రదేశ్ కు ​చెందిన యాత్రికుల బస్సుపై ఆదివారం సాయంత్రం ఉగ్రవాదులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఫలితంగా అదుపు తప్పిన బస్సు లోయలో పడి 9మంది ప్రాణాలు కోల్పోయారు. 41 మంది గాయపడ్డారు. పరిస్థితిని సమీక్షించిన ప్రధాని మోదీ.. ఈ దాడిలో హస్తమున్న ప్రతీ ఒక్కరికీ శిక్షపడుతుందని హెచ్చరించినట్లు ఎల్​జీ కార్యాలయం తెలిపింది. రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ఈ ఘటనపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఫుట్‌పాత్‌ల కబ్జా.. నరకం చూస్తున్న పాదచారులు, వాహనదారులు

పవన్‌ కళ్యాణ్‌కు హోం శాఖ ?? గబ్బర్‌ సింగ్‌ బ్యాక్‌ !!

అమెరికాలో అభిమానుల రచ్చ.. దేవరకొండను చూసేందుకు పోటీ !!

ఎలుకల దెబ్బకి.. ఏడ్చిన స్టార్ హీరో.. కోట్ల రూపాయల లగ్జరీ కారు షెడ్డుకే!

భక్తులకు గుడ్‌న్యూస్‌.. తక్కువ ఖర్చుతో పుణ్యక్షేత్ర సందర్శన