
బోనాలు పండుగ తర్వాతి రోజు జరిగే రంగం కార్యక్రమంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. భక్తులు సమర్పించిన బోనాలను సంతోషంగా అందుకున్నానని అన్నారు. రాబోయే రోజుల్లో మహమ్మారి వెంటాడుతుంది. అందరూ జాగ్రత్తగా ఉండాలి. మీరు పాటించాల్సినవి పాటించండి. అగ్నిప్రమాదాలు జరుగుతాయి. ముందే హెచ్చరిస్తున్నా అని చెప్పారు. ఈ ఏడాది కూడా వర్షాలు బాగా కురుస్తాయని చెప్పారు. తాను కోపంగా లేనని.. తాను కన్నెర్ర చేస్తే రక్తం కక్కుకుంటారు అంటూ స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు.
సికింద్రాబాద్‌లో ఘనంగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు జరుగుతున్నాయి. రంగం కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా పాల్గొన్నారు. సికింద్రాబాద్ మహంకాళి బోనాల జాతర బాగా జరిగిందన్నారు పొన్నం. అమ్మవారి కి జరగాల్సిన అన్ని పూజలు ప్రభుత్వం పక్షాన చేస్తామన్నారు. ఇక సాయంత్రం అంబారీ ఊరేగింపు ఉంటుంది. ఈసారి ఊరేగింపు కోసం కర్నాటక తుముకూరులోని శ్రీ కరిబసవ స్వామి మఠం నుంచి ఏనుగును తీసుకొచ్చారు.