Ram Gopal Varma: మా వ్యూహాలు మాకున్నాయి.. ఆర్జీవీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

| Edited By: Ravi Kiran

Nov 03, 2023 | 7:44 AM

వ్యూహం సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడానికి బోర్డు నిరాకరించింది. సినిమా కంటెంట్ ప్రస్తుతం జరుగుతున్న అంశాలతో ఉండడం, చిత్రంలోని పాత్రలకు నిజ జీవిత పేర్లు పెట్టడంపై బోర్డు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ కారణంగానే.. వ్యూహం సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించినట్లు తెలిపింది బోర్డు. ఇక.. సెన్సార్ బోర్డు తీసుకున్న నిర్ణయంపై వ్యూహం మేకర్స్ స్పదించారు.

సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవీ వ్యూహం మూవీకి సెన్సార్ బోర్డు షాకిచ్చింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో సినిమాను సెన్సార్ కోసం పంపారు మేకర్స్. అయితే.. వ్యూహం సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడానికి బోర్డు నిరాకరించింది. సినిమా కంటెంట్ ప్రస్తుతం జరుగుతున్న అంశాలతో ఉండడం, చిత్రంలోని పాత్రలకు నిజ జీవిత పేర్లు పెట్టడంపై బోర్డు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ కారణంగానే.. వ్యూహం సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించినట్లు తెలిపింది బోర్డు. ఇక.. సెన్సార్ బోర్డు తీసుకున్న నిర్ణయంపై వ్యూహం మేకర్స్ స్పదించారు. ఈ అంశంపై ఇప్పటికే రీవైజింగ్ అప్లై చేశామని వివరించారు. అయితే.. రివైజింగ్ అప్లికేషన్‌పై రిప్లై ఎలా ఉంటుందన్నది సప్పెన్స్‌గా మారింది. అటు… అర చేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపలేరు.. ఎన్ని వ్యూహాలు పన్నినా మా “వ్యూహం”ను ఆపలేరు అంటూ రామ్‌గోపాల్‌ వర్మ ట్వీట్‌ చేశారు.

Published on: Nov 03, 2023 07:34 AM