AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Squirrel: యూనివర్సిటీలో 18 మందిని కరిచిన ఉడుత !!

Squirrel: యూనివర్సిటీలో 18 మందిని కరిచిన ఉడుత !!

Phani CH
|

Updated on: May 03, 2026 | 4:04 PM

Share

మోహన్‌లాల్ సుఖాడియా యూనివర్సిటీలో ఓ ఉడుత నెల రోజులుగా విద్యార్థులు, సిబ్బందిపై దాడి చేస్తూ 18 మందిని గాయపరిచింది. దీంతో క్యాంపస్‌లో భయాందోళనలు నెలకొన్నాయి. తీవ్ర ఎండలు, ఆకలి కారణంగా ఉడుత దూకుడుగా ప్రవర్తిస్తోందని నిపుణులు భావిస్తున్నారు. యానిమల్ ఎయిడ్ విఫలం కావడంతో, వన్యప్రాణి నిపుణుల సహాయంతో ఉడుతను పట్టి అటవీ ప్రాంతానికి తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

రాజస్థాన్‌లోని మోహన్‌లాల్ సుఖాడియా యూనివర్సిటీలో ఓ ఉడుత బీభత్సం సృష్టించింది. నెల రోజులుగా క్యాంపస్‌లోని విద్యార్థులు, సిబ్బందిపై వరుసగా దాడులు చేస్తూ 18 మందిని కరిచి గాయపరిచింది. దీంతో యూనివర్సిటీలో భయాందోళనలు నెలకొన్నాయి. విద్యార్థులు క్యాంపస్‌లో తిరగాలంటేనే జంకుతున్నారు. యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజీ క్యాంపస్, ముఖ్యంగా సైకాలజీ, ఉమెన్స్ స్టడీస్ విభాగాల సమీపంలో ఈ దాడులు ఎక్కువగా నమోదయ్యాయి. ఏప్రిల్ 22న ఇద్దరు రీసెర్చ్ స్కాలర్లపై కూడా ఆ ఉడుత దాడి చేయడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. కర్టెన్ల వెనుక దాక్కొని, అకస్మాత్తుగా మీదకు దూకి దాడి చేస్తుండటంతో దీని బారి నుంచి తప్పించుకోవడం కష్టంగా మారిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉడుత భయంతో కొందరు విద్యార్థులు క్యాంపస్‌కు రావడం కూడా మానేశారు. ఈ విషయంపై ఆర్ట్స్ కాలేజీ అసోసియేట్ డీన్ ఏం చెప్పారంటే.. ఉడుతను సురక్షితంగా పట్టుకునేందుకు యానిమల్ ఎయిడ్ బృందం ప్రయత్నించి విఫలమైందని అన్నారు. దీంతో ఇప్పుడు వన్యప్రాణి నిపుణుల సహాయం తీసుకోవాలని నిర్ణయించామని, వారి ఆధ్వర్యంలో ఉడుతను పట్టుకుని అటవీ ప్రాంతానికి తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు. ఉడుత అసాధారణ ప్రవర్తనకు వాతావరణంలో పెరుగుతున్న తీవ్ర ఎండలే కారణం కావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అధిక ఉష్ణోగ్రతల వల్ల చిన్న జంతువుల్లో ఒత్తిడి పెరిగి, దిక్కుతోచని స్థితిలో దూకుడుగా ప్రవర్తించే అవకాశం ఉందని అంటున్నారు. దీర్ఘకాలిక ఆకలి కూడా దీనికి మరో కారణం కావచ్చని భావిస్తున్నారు. ముందుజాగ్రత్త చర్యగా, ఉడుత దాడిలో గాయపడ్డ వారికి టెటనస్ ఇంజెక్షన్లు ఇస్తున్నారు. త్వరలోనే ఈ సమస్యను అదుపులోకి తెచ్చి, క్యాంపస్‌లో మళ్ళీ సాధారణ పరిస్థితులు నెలకొనేలా చూస్తామని అధికారులు చెబుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Monalisa Bhosle: ఆ నలుగురిపై కేసు పెట్టిన మోనాలిసా

హైదరాబాద్‌లో క్యాబ్‌ దోపిడీ.. రూ.200 జర్నీకి రూ.500 వసూల్

బెట్టింగ్ గేమ్స్ ఆడుతున్నారా ?? రూల్స్ మారాయి.. జాగ్రత్త

తండ్రి సెక్యూరిటీ గార్డు.. కోటి ఆశలతో అమెరికాకు కొడుకు.. క్షణికావేశంలో..

Singer Mangli: వాడి ఇంట్లో ఒక్క పూట భోజనం చేసిన పాపానికి అనుభవిస్తున్నా..

Follow Us