స్కూల్‌కు వెళ్లాలన్నదే ఆ విద్యార్థుల లక్ష్యం.. ప్రాణాలను పణంగా పెట్టి మరి..

Updated on: Sep 04, 2025 | 12:22 PM

స్కూల్‌కు వెళ్లాలన్నది ఆ విద్యార్థుల లక్ష్యం. ఇందుకోసం ప్రాణాలను పణంగా పెట్టి సాహసం చేస్తున్నారు. ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రాజస్థాన్‌లోని అల్వర్ జిల్లా సరిస్కా ప్రాంతం అతలాకుతలమవుతోంది. లోతట్టు ప్రాంతాలు నీటమునిగి చెరువులను తలపిస్తున్నాయి. వరద ఉద్ధృతికి పలు చోట్ల రహదారులు, వంతెనలు ధ్వంసమయ్యాయి. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

స్కూల్‌కు వెళ్లాలన్నది ఆ విద్యార్థుల లక్ష్యం. ఇందుకోసం ప్రాణాలను పణంగా పెట్టి సాహసం చేస్తున్నారు. ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రాజస్థాన్‌లోని అల్వర్ జిల్లా సరిస్కా ప్రాంతం అతలాకుతలమవుతోంది. లోతట్టు ప్రాంతాలు నీటమునిగి చెరువులను తలపిస్తున్నాయి. వరద ఉద్ధృతికి పలు చోట్ల రహదారులు, వంతెనలు ధ్వంసమయ్యాయి. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వరదలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. మరోవైపు జోధావాస్ దగ్గర రూపారేల్ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రమాదకరస్థాయిలో వరద ప్రవహిస్తున్నప్పటికీ విద్యార్థులు అలాగే దాటుతూ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం స్కూల్‌కు వచ్చినప్పుడు వరద అంతగా లేదని.. స్కూల్ ముగిసే సమయానికి వరద పెరిగిందని.. పిల్లలను ఇంటికి పంపడం తప్పనిసరి అయిందని టీచర్లు క్లారిటీ ఇచ్చారు.