పదో తరగతి అర్హతతో రైల్వేలో 4,116 ఉద్యోగాలు

Updated on: Nov 22, 2025 | 11:36 AM

నిరుద్యోగులకు గుడ్ న్యూస్! నార్తర్న్, సౌత్ ఈస్టర్న్ రైల్వేలలో మొత్తం 5,800కు పైగా అప్రెంటీస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. 10వ తరగతి, ITI అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. ఆన్‌లైన్ దరఖాస్తులు నవంబర్ 25 నుండి ప్రారంభమవుతాయి. వివరాల కోసం త్వరగా దరఖాస్తు చేసుకోండి.

ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ క్లస్టర్‌లలో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నార్తర్న్‌ రైల్వే నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 4,116 అప్రెంటీస్‌ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు అభ్యర్ధులు ఎవరైనా నవంబర్ 25వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ పోస్టులను ట్రేడ్‌, మెడిసిన్‌, ఎలక్ట్రీషియన్‌, ఫిట్టర్‌, ఎలక్ట్రానిక్స్‌ మెకానిక్‌, కార్పెంటర్‌ వంటి మొదలైన ట్రేడుల్లో భర్తీ చేస్తారు. పోస్టులను అనుసరించి పదో తరగతితోపాటు సంబంధిత విభాగంలో ఐటీఐలో ఉత్తీర్ణత పొందిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే అభ్యర్ధుల వయోపరిమితి 2025 డిసెంబర్‌ 24వ తేదీ నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాలకు నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ అర్హతలు ఉన్న వారు ఎవరైనా ఆన్‌లైన్‌ విధానంలో డిసెంబర్ 24, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద ప్రతి ఒక్కరూ 100 రూపాయిల చొప్పున చెల్లిచాల్సి ఉంటుంది. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. మరో వైపు సౌత్‌ ఈస్ట్రన్‌ రైల్వే పరిధిలోని అన్ని డివిజన్‌లలో యాక్ట్ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతూ కోల్‌కతాలోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద 1,785 యాక్ట్ అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో డిసెంబర్‌ 17, 2025వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. పదో తరగతిలో వచ్చిన మార్కులతోపాటు ఐటీఐ స్కోర్ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది. అభ్యర్ధుల వయోపరిమితి జనవరి 1, 2026 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.ఆసక్తి కలిగిన వారు డిసెంబర్‌ 12, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము కింద జనరల్‌ అభ్యర్ధులు 100 రూపాయిలు చొప్పున చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు,మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. ఎలాంటి రాత పరీక్ష లేకుండా మెట్రిక్యులేషన్‌, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇంటింటికి బొట్టు పెట్టి ఇందిరమ్మ చీరల పంపిణీ.. ఎవరు అర్హులంటే

ములుగు జిల్లాలో గుప్తనిధులు.. ఒక్కో నాణెం 23 తులాలు ??

తోటలో పనిచేసుకుంటున్న రైతు.. పొదల మధ్య సీన్‌ చూసి షాక్‌

iBomma: ఐ బొమ్మ రవికి ఎలాంటి దారుణ శిక్ష పడబోతుందో తెలుసా ??

Manchu Lakshmi: మంచు లక్ష్మికి లైంగిక వేధింపులు