దటీజ్ లారెన్స్.. దివ్యాంగురాలి కోసం వీడియో

Updated on: Sep 09, 2025 | 1:59 PM

రాఘవ లారెన్స్ గురించి తెలుగు, తమిళ సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నటుడిగా, కొరియోగ్రాఫర్ గా, దర్శకుడిగా బిజీగా ఉంటూనే మరోవైపు సామాజిక సేవలోనే దూసుకుపోతున్నారు లారెన్స్. తన సేవా గుణంతో ఇప్పటికే ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపారు. తాజాగా శ్వేత అనే దివ్యాంగురాలి లైఫ్ మార్చేశారు. ఆమెకు లారెన్స్ చేసిన సాయం పట్ల నెట్టింట ప్రశంసల వర్షం కురుస్తుంది.

కటిక పేదరికంలో ఉన్న శ్వేత అనే యువతి అసలు నడవలేదు. అనారోగ్య సమస్యలతో కొన్నాళ్లుగా ఆమె మంచానికే పరిమితమైంది. ఈ విషయాన్ని తెలుసుకున్న లారెన్స్ ఆమెకు అండగా నిలబడ్డారు. కొద్ది రోజుల క్రితం ఆమెకు ఓ స్కూటీ బహుమతిగా అందించారు. అలాగే ఆమె నడిచేందుకు సపోర్ట్ గా కృత్రిమ కాళ్ళను ఏర్పాటు చేయించారు. అంతటితో ఆగకుండా గుడిసెలో జీవిస్తున్న ఆమెకు పక్కా ఇల్లు కట్టించాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని లారెన్స్ ట్వీట్ చేశారు. దీంతో ఆయన మంచి మనసుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు అభిమానులు. కష్టాల్లో ఉన్నవారికి లారెన్స్ సాయం చేయడం ఇది మొదటిసారి కాదు. గతంలో ఎంతోమందికి అండగా నిలబడ్డారు. సినిమాల ద్వారా సంపాదించిన ఆస్తులను సామాజిక సేవకు ఉపయోగిస్తూ ఉంటారు. తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనాధలు, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు సాయం చేస్తూ ఉంటారు. అనేకమంది విద్యార్థులకు స్కాలర్ షిప్ ఇస్తూ చదువు కొనసాగించేందుకు తోడ్పడుతూ ఉంటారు. రైతులకు ట్రాక్టర్లు అందించి అండగా నిలిచారు.

మరిన్ని వీడియోల కోసం :

అంతరిక్షంలో ఇరుక్కుపోయా.. ఆక్సిజన్‌కి డబ్బులు పంపవా?వీడియో

వారికి జీతం 3 రెట్లు పెంపు.. ఒక్కొక్కరికీ నెలకు రూ.లక్షపైనే వీడియో

ప్రకాశ్ రాజ్ ఎమోషనల్ పోస్ట్.. డియర్ గౌరీ అంటూ.. వీడియో

పని వాళ్లకి రూ.80 లక్షల ఇల్లు గిఫ్ట్ వీడియో

Published on: Sep 09, 2025 12:10 PM