Watch: పీవీ నరసింహారావు ఫ్లైఓవర్‌పై వరుసగా ఢీకొన్న కార్లు.. భారీగా ట్రాఫిక్ జామ్

Updated on: Aug 31, 2025 | 9:34 AM

మెహదీపట్నం నుండి ఆరంగర్ వైపు వెళ్తున్న వాహనాలు గుడిమల్కాపూర్ పిల్లర్ నెంబర్ 105 వద్ద ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. అదృష్టవశాత్తు ఎవరికి ప్రాణనష్టం జరగలేదు. అయితే, ఈ ప్రమాదం కారణంగా మెహదీపట్నం నుండి శంషాబాద్ వైపు వెళ్లే రోడ్డుపై తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న గుడిమల్కాపూర్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.

హైదరాబాద్‌లోని పీవీ నరసింహారావు ఫ్లైఓవర్‌పై శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. మెహదీపట్నం నుండి ఆరంగర్ వైపు వెళ్తున్న వాహనాలు గుడిమల్కాపూర్ పిల్లర్ నెంబర్ 105 వద్ద ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. అదృష్టవశాత్తు ఎవరికి ప్రాణనష్టం జరగలేదు. అయితే, ఈ ప్రమాదం కారణంగా మెహదీపట్నం నుండి శంషాబాద్ వైపు వెళ్లే రోడ్డుపై తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న గుడిమల్కాపూర్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. ప్రమాదానికి గల కారణాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..