Prabhas: దటీజ్ ప్రభాస్.. నమ్ముకున్నోళ్లకు నష్టం రానీడు
భారీ నష్టాలతో సతమతమవుతున్న 'రాజాసాబ్' నిర్మాతలకు ప్రభాస్ అండగా నిలిచారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో మరో సినిమా చేయడానికి ఒప్పుకోవడమే కాకుండా, 'స్పిరిట్' పంపిణీ హక్కులను మైత్రీ మూవీస్‌తో వారికే అందేలా చేశారు. సినిమా కోసం పూర్తి రెమ్యునరేషన్ తీసుకోని ప్రభాస్, నిర్మాత నష్టపోకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈయన గొప్ప మనసు సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటోంది.
ఏదైనా ఒక సినిమాతో భారీగా నష్టపోతే సదరు నిర్మాతల్ని హీరోలు ఆదుకోవడం పలు సందర్భాల్లో జరుగుతున్నదే.. ఈ క్రమంలోనే రాజాసాబ్ నష్టాలను భర్తీ చేసేందుకు ప్రభాస్ ముందుకు వచ్చినట్లు సమాచారం. భవిష్యత్‌లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో మరో సినిమా చేసేందుకు ప్రభాస్ ఓకే చెప్పారని ఇండస్ట్రీలో వినిపిస్తుంది. నిర్మాత విశ్వప్రసాద్‌కు ఆయన మాటిచ్చారట. ప్రస్తుతం ప్రభాస్ లైనప్‌లో ఉన్న సినిమాలు పూర్తి అయిన తర్వాత ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. సరైన కథతో పాటు దర్శకుడిని కూడా చూసుకోవాలని ప్రభాస్ సూచించారట. అంతేకాదు స్పిరిట్ మూవీ పంపిణీ హక్కులను మైత్రీ మూవీస్‌తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి అందేలా ప్రభాస్ చేశారు. అలా రాజాసాబ్ నిర్మాతను కాపాడేందుకు ప్రభాస్ ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. రాజాసాబ్ కోసం ప్రభాస్ పూర్తి రెమ్యునరేషన్‌ను కూడా తీసుకోలేదని టాక్ ఉంది. కేవలం అడ్వాన్స్ రూపంలో కొంత మొత్తం మాత్రమే తీసుకున్నారట. సినిమా విడుదల తర్వాత పరిస్థితి మారిపోవడంతో మిగిలిన పారితోషకం గురించి నిర్మాతతో చర్చించలేదట. దీంతో ప్రభాస్ మంచి తనం మరో సారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. నమ్ముకున్నోళ్లకు నష్టం రానీడు మా హీరో అనే కామెంట్ ఫ్యాన్స్ నుంచి నెట్టింట వస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
New OTT Releases: ధురంధర్ తెలుగు వెర్షన్‌తో పాటు..మరిన్ని ఇంట్రెస్టింగ్ OTT రిలీజ్ డీటైల్స్
టీడీపీ జెండాతో సెల్ టవర్ ఎక్కిన వ్యక్తి.. సత్యసాయి జిల్లాలో హైటెన్షన్
వారెవా.. లిటిల్ జీనియస్ రూబిక్ క్యూబ్ ఆర్ట్‌తో రికార్డులు
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?? రోడ్డు కోసం గుర్రాలపై వెళ్లి వినతి పత్రం
టీడీపీ జెండాతో సెల్ టవర్ ఎక్కిన వ్యక్తి..
వారెవా.. లిటిల్ జీనియస్ రూబిక్ క్యూబ్ ఆర్ట్‌తో రికార్డులు
మందుకు డబ్బుల్లేక.. ఆర్టీసీ బస్ కాజేశాడు.. మహానుభావుడు
మతిస్థిమితం లేని వ్యక్తి చేసిన పని.. చావు దాకా వెళ్లిన చిన్నారులు
లిఫ్ట్ ఓపెన్.. మంగళసూత్రం ఖతం !!
అద్భుతం.. సాగర గర్భంలో త్రివర్ణపతాక ధగధగలు
సైగలతోనే బధిర బాలల జాతీయ గీతం

