మీరు జిమ్‌కి వెళ్తున్నారా.. అయితే ఇది మీ కోసమే

Updated on: Jul 29, 2025 | 9:25 PM

మీరు జిమ్‌కి వెళ్తున్నారా? మరి జిమ్‌ చేసి వచ్చిన తర్వాత మంచి ప్రొటీన్‌ ఫుడ్‌ తింటున్నారా? ఎందుకంటే జిమ్‌ చేసిన తర్వాత శరీరంలో చాలా కేలరీలు ఖర్చవుతాయి. మళ్ళీ శరీరం తిరిగి శక్తిని పుంజుకోవాలంటే తగినంత పోషకాహారం శరీరానికి అందించాలి. అది కూడా మంచి ప్రొటీన్‌ ఉన్న ఆహారం. చాలామంది జిమ్‌ చేసిన తర్వాత ప్రోటీన్ షేక్స్ తాగుతుంటారు.

అయితే ప్రోటీన్ షేక్స్ కంటే జిమ్ చేసిన తర్వాత మంచి ప్రోటీన్‌తో శరీరానికి శక్తినిచ్చే ఆహారం కడుపు నిండా తినటం బెస్ట్‌ అంటున్నారు. అదికూడా మన భారతీయ వంటకాలతోనే..అవేంటో చూద్దాం. శరీరానికి మేలు చేసే ఆహారపదార్థాల్లో చనా మసాలా ఒకటి. ఇందులో హై ప్రోటీన్ ఉంటుంది. యూఎస్ డీఏ ప్రకారం 100 గ్రాముల చనాలో దాదాపు 19 గ్రాముల ప్రోటీన్ ఉంటుందంట. అందువలన దీనిని వ్యాయామం తర్వాత రోటీతో తీసుకుంటే కండరాల వృద్ధికి ఇది దోహదం చేస్తుందంట. సోయా కీమాలో ఐరన్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. అందువలన జిమ్ తర్వాత ఇది తినడం చాలా మంచిదంట. దీనిని సోయా బీన్స్ తో తయారు చేస్తారు. అత్యధిక ప్రోటీన్ ఉండే శాఖాహార వంటకం ఇది. దీనిని టమోటాలు, మసాలాలు, ఉల్లిపాయలు బీన్స్ తో చేస్తారు. దీనిలో అత్యధిక ప్రోటీన్ ఉంటుంది. అందువలన వ్యాయామం తర్వాత మల్టీ గ్రెయిన్ రోటీతో దీనిని తింటే ఆరోగ్యానికి చాలా మంచిదంట. పెసరట్టు చాలా మందికి ఎంతో ఇష్టమైన ఫుడ్. పెసరపప్పుతో తయారు చేసే దీనిలో అత్యధిక ప్రోటీన్ ఉంటుంది. దీనిని వ్యాయామం తర్వాత తినడం వలన త్వరగా కడుపు నిండిన భావన కలిగించడమే కాకుండా, శరీరానికి మంచి ప్రోటీన్‌ను అందిస్తుందంట. అందుకే జిమ్ చేసేవారికి ఇది మేలుచేస్తుంది. ఓన్లీ ఉడికించిన కోడి గుడ్లను ఒకటి రెండు తింటే కాసేపటికే ఆకలేస్తుంది.. నీరసం కూడా వస్తుంది. అలాకాకుండా కోడి గుడ్డును కర్రీగా చేసుకొని భోజనం చేయడం వలన ఇది శరీరానికి మేలు చేస్తుందంట. యూఎస్‌డీఏ ప్రకారం, ఒక పెద్ద కోడి గుడ్డులో దాదాపు ఆరు గ్రాముల ప్రోటీన్ ఉంటుందంట. అందువలన జిమ్ తర్వాత భోజనంలో బాయిల్డ్ ఎగ్ తినడం ఆరోగ్యానికి చాలా మంచిదంట. పాలక్ పన్నీర్ మంచి రుచిగా ఉండటమే కాకుండా శరీరానికి తగిన ప్రోటీన్‌నూ అందిస్తుందంట. రోటీతో పాలక్ పన్నీర్ తీసుకోవడం వలన ఇది శరీరానికి శక్తినిస్తుందంట. వ్యాయామం తర్వాత తినడానికి ఇది బెస్ట్ ఫుడ్ అంటున్నారు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే.. ఏదైనా సమస్య ఉంటే వైద్యులను సంప్రదించడం మంచిది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

30 ఏళ్లకు వికసించిన కమలం మురిసిన కాశ్మీరం

స్విమ్మింగ్ పూల్ లో ఆఫీస్ డెస్కులు.. వినూత్న ఆలోచనకు ఉద్యోగులు ఫిదా..

నాకు ఉద్యోగం ఇవ్వండి.. నా ట్యాలెంట్‌ ఏంటో చూపిస్తా..

వేగంగా కదులుతున్న రైల్లో రీల్స్‌ చేస్తున్న యువతి, ఇంతలో..

ఆర్డర్‌ పెట్టకుండానే వందలకొద్దీ పార్శిళ్లు..