Undavalli Sridevi: అనర్హత వేటు నోటీసులు అందలేదు.. వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కామెంట్స్

|

Jan 09, 2024 | 1:59 PM

పార్టీ ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలపై అనర్హత వేటు వేయాలని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు వైసీపీ ఫిర్యాదు చేసింది. అలాగే ఎమ్మెల్సీలు సీ.రామచంద్రయ్య, వంశీకృష్ణ యాదవ్‌పై అనర్హత వేటు వేయాలని మండలి ఛైర్మన్‌ను కోరింది.

పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పార్టీ ఫిరాయింపులను వైసీపీ అధిష్టానం సీరియస్‌గా పరిగణిస్తుండటం తెలిసిందే. వారిపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద చర్యలు తీసుకునే దిశగా చర్యలు మొదలుపెట్టింది. పార్టీ ఫిరాయించిన నలుగురు రెబల్ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలపై అనర్హత వేటు వేయాలని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు వైసీపీ సోమవారం (జనవరి 8న) ఫిర్యాదు చేసింది. అలాగే ఎమ్మెల్సీలు సీ.రామచంద్రయ్య, వంశీకృష్ణ యాదవ్‌పై అనర్హత వేటు వేయాలని మండలి ఛైర్మన్‌ను కోరింది. నలుగురు ఎమ్మెల్యేలు తెలుగు దేశం పార్టీలో చేరారు. ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ ఇటీవల జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోగా.. సీ.రామచంద్రయ్య టీడీపీకి జై కొట్టారు.

ఈ నేపథ్యంలో తనపై అనర్హత వేటు వేయాలంటూ స్పీకర్‌కు వైసీపీ ఫిర్యాదు చేయడంపై ఆ పార్టీ రెబల్ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి స్పందించారు. తమకు నోటీసులు పంపినట్లు మీడియాలోనే చూసినట్లు తెలిపారు. అయితే ఈ అంశంపై తనకు ఇప్పటి వరకు ఎలాంటి నోటీసులు రాలేదన్నారు. నోటీసులు వచ్చిన తరువాతే దీనిపై స్పందిస్తానని అన్నారు. తమ వివరణ తీసుకున్న తర్వాతే తదుపరి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. దీనిపై చట్టప్రకారం నడుచుకుంటానని వెల్లడించారు.

Follow us on