Weekend Hour: ఢీ కొడతారా.. ఢీలా పడతారా..! 23న పాట్నాలో కీలక సమావేశం.. విపక్షాల వ్యూహం ఏంటి..?
దేశ రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికలను ప్రతిపార్టీ లైఫ్ అండ్ డెత్‌గా తీసుకుంటున్నాయి. కలిసికట్టుగా బీజేపీని ఢీకొట్టాలని విపక్షాలు తమ బలగాలతో సిద్దమవుతుంటే.. పాత మిత్రులతో కలిసి మళ్లీ అజేయశక్తిగా నిలబడాలనుకుంటోంది కాషాయం పార్టీ. విపక్షాలు 4వందల 50 సీట్లలో తాడోపేడో తేల్చుకుందామని ప్రయత్నాలు మొదలుపెడితే..
దేశ రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికలను ప్రతిపార్టీ లైఫ్ అండ్ డెత్‌గా తీసుకుంటున్నాయి. కలిసికట్టుగా బీజేపీని ఢీకొట్టాలని విపక్షాలు తమ బలగాలతో సిద్దమవుతుంటే.. పాత మిత్రులతో కలిసి మళ్లీ అజేయశక్తిగా నిలబడాలనుకుంటోంది కాషాయం పార్టీ. విపక్షాలు 4వందల 50 సీట్లలో తాడోపేడో తేల్చుకుందామని ప్రయత్నాలు మొదలుపెడితే.. ఎన్డీయేను బలోపేతం చేసి నాలుగు వందలకు పైగా సీట్లు గెలవాలనుకుంటోంది బీజేపీ. ఇప్పటివరకూ ఓ లెక్క.. ఇక మీదట మరో లెక్క అంటూ రంగంలో దిగుతున్నాయి పార్టీలు. బీజేపీని ఎలాగైనా ఓడించాలని విపక్షాలు ఒక్కటవుతున్నాయి. తమ బలాన్ని మరింత సుస్థిరం చేసుకోవడానికి బీజేపీ సరికొత్త వ్యూహాలతో దూసుకొస్తోంది. 2024 ఎన్నికలను లైఫ్ అండ్ డెత్‌గా భావిస్తున్న యాంటీ బీజేపీ పార్టీలన్నీ కూటమి కడుతున్నాయి. కాంగ్రెస్ సహా 18 పార్టీలు ఒక్కటై బీజేపీని ఢీకొట్టాలని ప్రయత్నాలు కూడా మొదలుపెట్టాయి. ఈ నెల 23న పాట్నా వేదికగా కీలక సమావేశం జరగనుంది. అవసరం అయితే త్యాగాలకు సిద్ధపడి మరీ కలిసికట్టుగా 450 సీట్లలో బీజేపీకి పోటీగా ఉమ్మడి అభ్యర్థులను పెట్టాలని ప్రాధమికంగా నిర్ణయానికి వచ్చాయి. నితీష్, మమత బెనర్జీ వంటి సీనియర్లు దీనికి సారధ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్ కూడా ఇందుకు సై అంటోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.
Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.
Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.