Andhra: స్టీల్ ప్లాంట్ వార్.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు మాజీ మంత్రి అమర్నాథ్ కౌంటర్

Updated on: Aug 30, 2025 | 5:08 PM

151 ఎమ్మెల్యేలున్నప్పుడు జగన్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోలేదని..కేసుల భయంతో కేంద్ర ప్రభుత్వ పెద్దలను జగన్ ప్రశ్నించ లేదన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలకు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కౌంటర్ ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఎందుకు చంద్రబాబు, పవన్ మాట్లాడటం లేదంటూ అమర్నాథ్‌ పేర్కొన్నారు.

151 ఎమ్మెల్యేలున్నప్పుడు జగన్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోలేదని..కేసుల భయంతో కేంద్ర ప్రభుత్వ పెద్దలను జగన్ ప్రశ్నించ లేదన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలకు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కౌంటర్ ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఎందుకు చంద్రబాబు, పవన్ మాట్లాడటం లేదంటూ అమర్నాథ్‌ పేర్కొన్నారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రైవేటీకరణ వైసీపీ వ్యతిరేకం అంటూ పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలవడానికే ప్రైవేటీకరణ అడ్డుకుంటామని చంద్రబాబు, పవన్, లోకేష్‌ హామీ ఇచ్చారని గుర్తుచేశారు… ప్రజలను మోసం చేశామని పవన్, చంద్రబాబు క్షమాపణ చెప్పాలంటూ అమర్నాథ్‌ డిమాండ్ చేశారు. అంతకుముందు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ మాట్లాడుతూ.. 151 ఎమ్మెల్యేలున్న జగన్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోలేదన్నారు. కేసుల భయంతో కేంద్ర ప్రభుత్వ పెద్దలను జగన్ ప్రశ్నించ లేదన్నారు. విశాఖ ఉక్కు సెంటిమెంట్ మోదీ, అమిత్‌ షాకి వివరించాం.. జనసేన వల్లే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగలేదంటూ పవన్ చెప్పారు.