Pawan Kalyan: తెలంగాణలో పవన్ కల్యాణ్ వారాహి యాత్ర..! టాప్ హెడ్‌లైన్స్ టుడే..

తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఓ వైపు అభ్యర్థుల జాబితాలు రిలీజ్‌ చేస్తూనే.. కలిసి వచ్చే వారితో పొత్తుల కోసం ప్రయత్నిస్తున్నాయి ప్రధాన పార్టీలు. ఈ క్రమంలోనే.. ఎవరికి వారే యుమునా తీరే అన్నట్టుగా ఉన్న బీజేపీ, జనసేన.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ దగ్గరయ్యాయి. కలిసి పోటీ చేయాలని రెండు పార్టీలు నిర్ణయించుకున్నాయి.

Edited By:

Updated on: Oct 26, 2023 | 4:14 PM

తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఓ వైపు అభ్యర్థుల జాబితాలు రిలీజ్‌ చేస్తూనే.. కలిసి వచ్చే వారితో పొత్తుల కోసం ప్రయత్నిస్తున్నాయి ప్రధాన పార్టీలు. ఈ క్రమంలోనే.. ఎవరికి వారే యుమునా తీరే అన్నట్టుగా ఉన్న బీజేపీ, జనసేన.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ దగ్గరయ్యాయి. కలిసి పోటీ చేయాలని రెండు పార్టీలు నిర్ణయించుకున్నాయి. తాజాగా.. ఢిల్లీ వేదికగా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో జనసేన అధ్యక్షులు పవన్‌కల్యాణ్‌ భేటీ అయ్యారు. తెలంగాణలో బీజేపీ-జనసేన పొత్తు, సీట్ల సర్దుబాటుపై అమిత్‌ షాతో చర్చించారు. పవన్‌ కల్యాణ్ వెంట తెలంగాణ బీజేపీ చీఫ్‌ కిషన్‌రెడ్డి, జనసేన PAC చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ఉన్నారు. ఇప్పటికే.. కిషన్‌రెడ్డి, లక్ష్మణ్.. పవన్‌ కల్యాణ్‌ను కలిసి తెలంగాణలో బీజేపీకి మద్దతివ్వాలని కోరారు. అయితే, జనసేనకు కేటాయించనున్న సీట్లపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ క్రమంలో తెలంగాణలో కూడా పవన్ కల్యాణ్ వారాహి యాత్ర ఉంటుందని.. ఆయా పార్టీల్లో టాక్ వినిపిస్తోంది..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us