గోదావరి జలాలు 10 లక్షల ఎకరాలకు ఇవ్వడమే నా లక్ష్యం - తుమ్మల

గోదావరి జలాలు 10 లక్షల ఎకరాలకు ఇవ్వడమే నా లక్ష్యం – తుమ్మల

Ram Naramaneni

|

Updated on: Nov 22, 2023 | 12:42 PM

గడిచిన ఐదేళ్లుగా తెలంగాణ రాష్ట్రం మాఫియా చేతుల్లో బందీగా ఉండిపోయిందని ఖమ్మం కాంగ్రెస్‌ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరితో కలిసి ఆయన తాను పోటీ చేస్తున్న ఖమ్మంలో ప్రచారం నిర్వహించారు. తనకు, రేణుకా చౌదరికి రాజకీయ జన్మనిచ్చింది ఎన్టీఆర్‌ అని తుమ్మల గుర్తు చేసుకున్నారు.

గడిచిన ఐదేళ్లుగా తెలంగాణ రాష్ట్రం మాఫియా చేతుల్లో బందీగా ఉండిపోయిందని ఖమ్మం కాంగ్రెస్‌ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరితో కలిసి ఆయన తాను పోటీ చేస్తున్న ఖమ్మంలో ప్రచారం నిర్వహించారు. తనకు, రేణుకా చౌదరికి రాజకీయ జన్మనిచ్చింది ఎన్టీఆర్‌ అని తుమ్మల గుర్తు చేసుకున్నారు. గోదావరి జలాలు 10 లక్షల ఎకరాలకు ఇవ్వాలనేది తన రాజకీయ లక్ష్యమని తుమ్మం అన్నారు.

పువ్వాడ అజయ్‌ ఎన్నికల్లో ఓడిపోతారని తాను సంవత్సరం క్రితమే జోస్యం చెప్పానని మాజీ మంత్రి రేణుకా చౌదరి అన్నారు. అజయ్‌లాంటి వ్యక్తికి సమాజంలో స్థానం కల్పించడం సబబేనా అని ప్రశ్నించారు. దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని పరుషపదజాలంతో రేణుక విమర్శలు గుప్పించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

 

Published on: Nov 22, 2023 12:39 PM