Telangana: ప్రాణమున్నంతవరకు ఎన్టీఆర్‌ను మరవను: తలసాని

Updated on: Nov 18, 2023 | 4:11 PM

చంద్రబాబు పట్ల ఏపీ ప్రభుత్వ తీరు సరికాదన్నారు తెలంగాణ మంత్రి శ్రీనివాస్ యాదవ్. అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్నారు. అధికారంలో ఉన్నామని వ్యక్తిగత కక్షసాధింపులు కరెక్ట్ కాదన్నారు. తనకు రాజకీయ జీవితం ప్రసాదించింది ఎన్టీఆరే అని చెప్పుకొచ్చారు.

కమ్మవారి సేవా సమితి ఆధ్వర్యంలో కార్తీక వన మహోత్సవంలో పాల్గొన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కీలక కామెంట్స్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పట్ల జగన్ సర్కార్ వ్యవహరించిన తీరును ఆయన తీవ్రంగా ఖండించారు.  అధికారం ఎవరికీ శాశ్వతం కాదని.. నేడు రూలింగ్‌లో ఉన్నామని వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలకు పూనుకోవడం సరికాదన్నారు. అమీర్ పేటలో TDP వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి NTR విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు.  1994లో ఎన్టీఆర్ నాటిన తలసాని శ్రీనివాస్ యాదవ్ అనే మొక్క  నేడు వృక్షంగా అభివృద్ధి చెందిందన్నారు. తనకు రాజకీయ జీవితం ప్రసాదించిన మహనీయులు NTRను ఎప్పుడూ మరవనన్నారు తలసాని.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Published on: Nov 18, 2023 03:27 PM