Telangana: రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో.

| Edited By: Shaik Madar Saheb

Nov 23, 2024 | 7:01 PM

సమగ్ర ఇంటింటి సర్వే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. ఈ సర్వే ప్రారంభమైనప్పటి నుంచి దీనిపై ప్రజలకు ఎన్నో అనుమానాలు కలిగాయి మొత్తం 56 అంశాలకు సంబంధించి 75 ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలు ప్రజల నుంచి సేకరిస్తుంది ప్రభుత్వం. ఇందులో విద్యార్థులు సామాజిక రాజకీయ ఆర్థికపరమైన వ్యక్తిగత విషయాలను ప్రభుత్వం సమాచారం సేకరిస్తుంది.

స్థిర చరాస్తులు సంబంధించిన అంశాలను కూడా నమోదు చేస్తుంది. ఉరకంగా చెప్పాలంటే ఒక వ్యక్తికి సంబంధించిన పూర్తి చరిత్ర ఈ 75 ప్రశ్నల రూపంలో ప్రభుత్వం సేకరిస్తుంది. ప్రభుత్వం సేకరించి సమాచారం భద్రతపై అనుమానాలకు చెక్ పెడుతూ ఎప్పటికప్పుడు మంత్రులు మాట్లాడారు. సమాచారం మొత్తం కూడా కేవలం కోట్ల రూపంలోనే సేకరిస్తున్నామని చెప్పారు. ఆధార్ తప్పనిసరి కాదని ఇస్తే మంచిదని వివరించారు. దీంతో ప్రజలు తమ సమాచారం చేతకు ముందుకు వచ్చారు. ఈ సమాచారంలో ఆధార్ నెంబర్ ఆప్షనల్ అయినప్పటికీ సమాచార భద్రతపై నమ్మకంతో ఆధార్ నెంబర్ను ఇచ్చారు అయితే నిన్న తార్నాక రోడ్డుపై సమగ్ర ఇంటింటి సర్వే కి సంబంధించిన ఫీల్ చేసిన అప్లికేషన్లు చెల్లాచెదురుగా పడిపోయిన ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కెరలు కొట్టింది. అప్లికేషన్ల మీద ఆధార్ నెంబర్లు ఇతర విలువైన సమాచారం ఉంది అయితే ఎందుకు గొప్పగా చెప్పి సమగ్ర కుటుంబ సర్వే వివరాలను సేకరించి ఇలా రోడ్డుపాలు చేయడంపై సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజలు.

ఇంత విలువైన సమాచారాన్ని ఇంత నిర్లక్ష్యంగా రోడ్డున పడేస్తారా అంటూ కామెంట్లు పెట్టారు.ఇక ఈ విషయం ప్రభుత్వం దృష్టి వరకు వెళ్ళింది దీనిపై బీసీ కమిషన్ వెంటనే స్పందించింది బీసీ కమిషన్ చైర్మన్ జై నిరంజన్ సంబంధిత అధికారుల నుంచి సమాచారం తెలుసుకొని ఆ దరఖాస్తులు జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు చెందినవిగా అధికారులు కోడ్ ఆధారంగా నిర్ధారించటంతో వెంటనే దీనిపై సమగ్రమైన రిపోర్టు అందించాలని ఆదేశించారు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కులాల కుటుంబ సర్వే దరఖాస్తులు రోడ్డుపై పడటం ఏమిటని ఇంతటి నిర్లక్ష్యం వహించిన అధికారులపై వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పింది. దీనికి సంబంధించిన పూర్తి నివేదిక శనివారం నాలుగు గంటల లోపుగా కమిషన్కు అందించాలని జవహర్ నగర్ మున్సిపల్ కమిషనర్ చల్ జిల్లా కలెక్టర్లకు విట్టల్ ద్వారా ఆర్డర్స్ ఇష్యూ చేసింది బీసీ కమిషన్. ఇక ఈ అంశంపై రాష్ట్ర డిజిపి దృష్టికి కూడా తీసుకెళ్లారు.

మొత్తానికి ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుంది ఇంతటి నిర్లక్ష్యం వహించిన అధికారులపై నివేదికద్ర వెంటనే చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Published on: Nov 23, 2024 06:52 PM