KCR: కేసీఆర్‌కు హైకోర్టు షాక్.! ఆ పిటిషన్ కొట్టివేత..
విద్యుత్ కొనుగోళ్లపై జస్టిస్ నరసింహా రెడ్డి కమిషన్ రద్దు చేయాలంటూ మాజీ సీఎం కేసీఆర్ వేసిన పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేసింది. ప్రభుత్వ వాదనతో ఏకీభవించిన కోర్టు పిటిషన్ రద్దు చేసింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై విచారణకు ఆదేశిస్తూ జస్టిస్ నరసింహా రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసింది. కమిషన్‌ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు మాజీ సీఎం కేసీఆర్.

ప్రభుత్వ తరపున వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్ కొన్ని కీలక అంశాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కమిషన్ ఏర్పాటులో కోర్టులు కలుగజేసుకోలేవని గుర్తు చేశారు. 15 మంది సాక్ష్యులను ఇప్పటి వరకు కమిషన్ విచారించింది. అందులో ట్రాన్స్‌కో, జెన్‌కో అధికారులు కూడా ఉన్నారు. సీఎండీ ప్రభాకర్‌రావును కూడా విచారించింది. కేసీఆర్‌కు కమిషన్ ఏప్రిల్‌లో నోటీసులు జారీ చేసింది. పార్లమెంట్ ఎన్నికల కారణంగా సమయం కావాలని కోరారు. జూన్ 30 వరకు కమిషన్‌కు గడువు ఉంది, జూన్ 15న విచారణకు రావాలని కమిషన్ కోరింది. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి నుంచి సైతం వివరాలు సేకరించింది అంటూ అడ్వకేట్ జనరల్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.