Loading video

Watch: మిల్క్ మ్యాన్‌గా మారిన మాజీ మంత్రి మల్లారెడ్డి.. వీడియో చూశారా..

|

Feb 16, 2025 | 9:35 PM

తెలంగాణ మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి (Ex Minister Malla Reddy) తన గత జీవితం పాల వ్యాపారం చేసే రోజులను గుర్తు చేసుకున్నారు. బోడుప్పల్‌లో ఒక స్కూటర్‌పై పాలు అమ్ముతున్న వ్యక్తిని చూసి, ఆయన స్వయంగా స్కూటర్‌పై కూర్చుని ఫోటోలు దిగారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. పాల వ్యాపారిగా జీవితాన్ని మొదలుపెట్టి ఆయన మంత్రి స్థాయికి ఎదగడం తెలిసిందే.

పాల వ్యాపారంతో జీవితంలో ఒక్కో మెట్టు ఎదిగిన తెలంగాణ మాజీ మంత్రి మల్లా రెడ్డి.. స్కూటర్ పై పాలు అమ్ముతూ సందడి చేశారు. మేడ్చల్ జిల్లా – బోడుప్పల్లో స్కూటర్ పై పాలు అమ్ముతు ఎమ్మెల్యే మల్లారెడ్డి అందరి దృష్టిని ఆకర్షించారు. ఓ కార్యక్రమానికి వెళ్లిన ఆయనకు అక్కడ పాల డబ్బాతో స్కూటర్ కనిపించడంతో మురిసిపోయారు. దాని దగ్గరకు వెళ్లి స్కూటర్ పై ఎక్కి కూర్చొన్నారు. ఒకప్పుడు తాను కూడా స్కూటర్ పైనే పాల వ్యాపారం చేసే వాడిని మల్లారెడ్డి గుర్తు చేసుకున్నారు. మల్లారెడ్డితో ఫొటోలు తీసుకునేందుకు అక్కడున్న వారు పోటీపడ్డారు.  మల్లారెడ్డి పాల స్కూటర్ ఎక్కి సందడి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Published on: Feb 16, 2025 09:33 PM